కౌశల్ మరీ అతి చేస్తున్నాడుగా

kaushal army differ with kaushal

బిగ్ బాస్ సీజన్ టు తో ఒక్కసారిగా టాప్ సెలేబ్రిటిగా మారిపోయిన కౌశల్ మాండా.. ప్రస్తుతం సీరియల్స్ షూటింగ్ తో బిజీగా వున్నాడు. బిగ్ బాస్ లోకి రాకముందే సీరియల్ నటుడిగా, మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకున్న కౌశల్ బిగ్ బాస్ లోకొచ్చాక ఆ క్రేజ్ మరింతగా పెంచుకున్నాడు. కౌశల్ ని కౌశల్ ఆర్మీ హీరోని చేసింది. ఇక బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక చేతినిండా సినిమాలు, పలు యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ కౌశల్ మారతాడు అనుకంటె.. అలాంటిదేం కనబడడం లేదు. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక.. గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్ కి తన పేరు పరిశీలనలో ఉంది, అలాగే ప్రైమ్ మినిస్టర్ నుండి కాల్ వచ్చింది అంటూ గొప్పలు పోయిన కౌశల్ చెప్పినవన్నీ అబద్ధాలని ప్రూవ్ అయ్యాయి.

అయితే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ బయటికొచ్చాక ఒక నెల పాటు కౌశల్ ఆర్మీని కలవడం, అలాగే కౌశల్ ఆర్మీతో మంచి పనులు చేపిస్తున్నా అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన కౌషల్ రిబ్బన్ కటింగ్స్ అంటూ హడావిడి చేసాడు. హీరో హీరోయిన్స్ తో పాటుగా తానూ షాప్ ఓపెనింగ్స్ లో రిబ్బన్స్ కట్ చేస్తూ కాస్త హడావిడి చేసాడు కూడా. బిగ్ బాస్ క్రేజ్ ని ఉపయోగించుకున్న కౌశల్… తనని షాప్ ఓపెనింగ్స్ కి పిలిచిన వారికీ చుక్కలు చూపెడుతున్నాడనే టాక్ వినబడుతుంది. మొదట్లో కౌశల్ కొన్ని విషయాల్లో బిగ్ బాస్ ని యూస్ చేసుకున్నా…. కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా షాప్ కటింగ్స్ తో క్యాష్ చేసుకుంటూ చెలరేగిపోదామనుకున్నాడు.

అందుకే తనని సంప్రదించే షాప్ యజమానులు రిబ్బన్ కటింగ్ చెయ్యాలంటే 25 లక్షలు కావాలంటూ డిమాండ్ చేసాడట. కౌశల్ చెప్పిన 25 లక్షల పారితోషకం విన్న షాప్ యజమానులు కౌశల్ కాల్ కట్ చేస్తున్నారట. మరి హీరోయిన్స్ కి కూడా లేని డిమాండ్ తనకి వచ్చేసింది అనుకున్నాడేమో కౌశల్ అందుకే.. ఇలా అడిగాడు. హీరోయిన్స్ అయితే ఐదారు లక్షలకే వచ్చేస్తుంటే…. బిగ్ బాస్ క్రేజ్ తో ఈయనకి 25 ఎక్కడ సమర్పించుకుంటాం అంటూ పారిపోతున్నారట షాప్ యజమానులు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*