బాబోయ్ ఈ లీకులు ఆగవా?

బిగ్ బాస్ 3

బిగ్ బాస్ సీజన్ త్రీ మొదలైంది మొదలు… బిగ్ బాస్ హౌస్ నుండి ప్రతి ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయం శనివారమే సోషల్ మీడియాలో లీకైపోతుంది. శనివారం నాగార్జున హోస్ట్ చేసే ఎపిసోడ్ శుక్రవారం రాత్రే షూటింగ్ అవడం, ఆదివారం ఎపిసోడ్ శనివారమే షూట్ చెయ్యడంతో.. బిగ్ బాస్ లీకులకు అన్నపూర్ణ స్టూడియోస్ వారే కారణమనేలా ఉన్నాయి. అంతేకాకుండా బిగ్ బాస్ ఎడిటింగ్ టీం వారు కూడా బిగ్ బాస్ లీకులు తమ సన్నిహితులకు చేరవేస్తూ సోషల్ మీడియాలో వదులుతున్నారు.

తాజాగా ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనే విషయం అప్పుడే సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడం చూస్తుంటే… బిగ్ బాస్ లీకులు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుస్తుంది. ఈ వారం రాహుల్, వరుణ్, మహేష్ నామినేషన్స్ లో ఉండగా… ఈ వారం బయటికెళ్లిన మహేష్ విషయం సోషల్ మీడియాలో అప్పుడే వచ్చేసింది. ముందునుండి గెస్ చేసినట్టుగానే… మహేష్ విట్టా ఈవారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటికెళ్లినట్టుగా సోషల్ మీడియా టాక్. మరి ఈ లీకులు ఇంట్రెస్ట్ ఇవ్వడంతో… అందరూ సోషల్ మీడియాలో ఆదివారం ఎపిసోడ్ కన్నా ముందే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అనే విషయాన్నీ వెతికేస్తున్నారు. మరి ఇలా సోషల్ మీడియాలో ముందే రావడంతో..బుల్లితెర మీది బిగ్ బాస్ చూసే ఇంట్రెస్ట్ తగ్గుతుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*