షో ని రక్తి కట్టించిన నాగ్?

Big Boss 4

నిన్నటివరకు బిగ్ బాస్ సీజన్ 4 చాలా చప్పగా సాగింది. షో లో తెలియని మొహాలు కామెడీ చేసినా బుల్లితెర ప్రేక్షకులు నవ్వలేని పరిస్థితి. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ సేఫ్ గేమ్ ఆడడం మొదటి రోజు నుండి జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో బిగ్ బాస్ 4 పై మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి. గత వారం ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే ఈ బిగ్ బాస్ 100 రోజులు స్టార్ మా లో సాగడం కష్టమే అనుకున్నారు. నిజంగానే అందరూ సెల్ఫ్ నామినేషన్ కి వెళ్లి చికాకు పుట్టించారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ సేఫ్ గా ఎవరేమనుకుంటారో.. ఒకరితో గొడవ అవసరమా అంటూ ఎవరికీ వాల్లే గమ్మునుంటున్నారు. జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాకే షో లో కాస్త ఊపు వచ్చింది. తాజాగా నాగార్జున హోస్టింగ్ లో ప్రసారమైన శనివారం ఎపిసోడ్ చూస్తే అబ్బ నాగ్ అందరికి ఓ మాస్టర్ లా క్లాస్ పీకాడనిపిస్తుంది. నాగ్ కాస్త కోపంగా ఒక్కో కంటెస్టెంట్ ని ఉతికి ఆరేసాడు.

ఎలిమినేషన్ లో ఉన్న వారిని నుంచో బెట్టి గంగవ్వని సేవ్ చేస్తున్నట్టుగా ప్రకటించి.. బిగ్ బాస్ గేమ్ లో సిల్లీ నామినేషన్స్ చేసారంటూ ఇంటి సభ్యులపై కోపం ప్రదర్శిస్తూ.. మీరంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఇప్పుడు ఎలా సేఫ్ గేమ్ ఆడతారో చూస్తా అంటూ.. హీరో – జీరో టాస్క్ తో ఒక్కొక్కళ్ళని ఒణికించాడు. ఇక హీరో – జీరో టాస్క్ లో చాలామంది అమ్మ రాజా శేకర్ హీరో అయితే కళ్యాణి, కుమార్ సాయిలకి జీరో లుగా ఓట్లేశారు. దెబ్బకి మొహం మీద ముసుకు తీసి ఫెయిర్ గేమ్ స్టార్ట్ చేసారు ఒక్కొక్కరు. ఇక లాస్య అన్న మాటకి అమ్మ రాజశేకర్ చిన్న పిల్లాడిలా కంటతడి పెట్టగా గంగవ్వ ఇంటి సభ్యులను ఓదార్చారు. ఇక లాస్య – దివి మధ్య మాటల యుద్ధం.. ఈ వీక్ లో రెండు ఎలిమినేషన్స్ లో ఒకటి కళ్యాణి ఎలిమినేషన్ జరిగింది. కళ్యాణి ని ఈ బిగ్ బాస్ సీజన్ 4 సెంకండ్ ఎలిమినేటర్ గా బయటికి వచ్చింది. ఇక నాగ్ పీకిన క్లాస్ వలన బిగ్ బాస్ షో రక్తి కట్టింది. నాగ్ కోపం షో చూసే వారిలో ఉత్సాహాన్ని నింపింది. మరి ఈ వారం సెకండ్ ఎలిమినేటర్ ఎవరో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 30215 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*