బిగ్ బాస్ నుండి ఈ రోజు ఎలిమినేటర్ ఆమేనా?

big boss 3 contestents

నాని వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్ టు సక్సెస్ఫుల్ గా 56 రోజులు ఈ రోజుతో కంప్లీట్ చేసుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ టు లో ఏదైనా జరగొచ్చు అంటూ అందరిలో రోజు రోజుకి ఆసక్తిని కలిగిస్తూ గేమ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు షో కంటెస్టెంట్స్. అయితే గత వారం వరకు బిగ్ బాస్ షో కాస్త కక్ష్యలు. కార్పణ్యాలతో జరిగితే…. తాజాగా ఒక వారం నుండి టాస్క్ ల విషయంలో గట్టిగా ఉండి టాస్క్ పూర్తి కాగానే అందరూ కలిసిపోయి ఆహ్లాదకర వాతావరణాన్ని షోలో చూపెడుతున్నారు. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ టు మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ పూజ రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చింది. ఇక పూజా చాలా తెలివిగా దృడంగా టాస్క్ లు ఆడడమే కాదు అందరితో చాలా చక్కగా మెసులుకోవడంతో షో కి వచ్చిన వారానికే ఆమె హౌస్ కి కెప్టెన్ అయ్యింది. ఇక బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ద్వారా తేజు అండ్ శ్యామల వస్తారనుకుంటే.. అనూహ్యంగా కామన్ మ్యాన్ నూతన నాయుడు ఎంట్రీ.. అలాగే శ్యామల వచ్చారు.

ఇక ఈ వారంలో ప్రత్యేకించి కమల్ హాసన్ తన టీమ్ తో విశ్వరూపం 2 ప్రమోషన్స్ కి షోకి రావడం మాత్రం బిగ్ బాస్ సీజన్ టు ప్రత్యేకతగా చెప్పొచ్చు. అలాగే ఈ వారం ఎలిమినేషన్స్ నుండి బాబు గోగినేని, కౌశల్ ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళ్లగా.. టివి 9 దీప్తి, గణేష్, నందిని లు ఈ రోజు ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఈరోజు షో నుండి ఎలిమినేట్ అవ్వబోయేది నందిని రాయ్ అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటినుండి బిగ్ బాస్ సీక్రెట్ విషయాలన్నీ ఎప్పటికప్పుడు బయటికొచ్చేస్తూ మీడియాలో నానా హంగామా చేస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం రాత్రి షోలో ప్రేక్షకులు చూస్తుంటే.. ఆ రోజు ఉదయమే బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ ని నాని ఆధ్వర్యంలో షూట్ చెయ్యడంతో ఆ రోజు రాత్రి ఎలిమినేషన్లో షో నుండి బయటికొచ్చే పార్టిసిపేట్ పేరు బయటికొచ్చేస్తుంది. ఈ విషయాన్నీ బిగ్ బాస్ సీరియస్ గా తీసుకున్నట్టుగా అనిపించడం లేదు. ఇక ఈ ఆదివారం హీరోయిన్ నందిని రాయ్ షో నుండి బయటికొచ్చేస్తుందనే టాక్ వినబడుతుంది. మరి షోలోకి వెళ్ళినప్పటినుండి నందిని రాయ్ ని నాని ఫర్నిచర్ తో పోల్చడం..ఆమె మెల్లిగా ఇప్పుడే పిక్ అప్ అవడం… ఆమె షో లో పెద్దగా ఆక్టివ్ లేకపోవడంతోనే ఈ రోజు షో నుండి నందిని బయటికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. చూద్దాం ఈ రోజు రాత్రి ఏదైనా జరగొచ్చు అని నాని చెప్పినట్టు ఏం జరగబోతుందో అనేది.

ఇంకో విషయం ఏమిటంటే నిన్న శుక్రవారం విడుదలై సక్సెస్ సాధించిన చి. ల.సౌ, అడవి శేష్ గూఢచారి మూవీ టీమ్స్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నాయి. మరి తమ సినిమాలు హిట్ అయ్యాయి.. అని ప్రేక్షకుల్లోకి మరింతగా ప్రచారం చెయ్యడం కోసం ఈ రెండు సినిమాల టీమ్స్ హీరోలతో కలిసి మరి బిగ్ హౌస్ లోకి వస్తున్నాయి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*