కౌశల్ పై మాస్ డైరెక్టర్ చూపు పడిందా?

kaushal army differ with kaushal

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టె ముందు సాధారణ టివి సెలేబ్రిటిగా అడుగుపెట్టిన కౌశల్ మూడో వారం తిరిగేసరికి గట్టి కంటెస్టెంట్ గా నిలదొక్కుకున్నాడు. అనుకోకుండా కౌశల్ కి అన్ని బిగ్ బాస్ హౌస్ లో కలిసి రావడంతో.. బయట కౌశల్ ఆర్మీ అంటూ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడంతో.. కౌశల్ ఇప్పుడు బిగ్ బాస్ హీరో అయ్యి కూర్చుకున్నాడు. అసలు కౌశల్ ఏం చెయ్యకుండానే కౌశల్ కి పరిస్థితులు అనుకూలిచండంతో.. ఇప్పుడు కౌశల్ తో పెట్టుకుంటే హౌస్ నుండి బయటికెళ్లిపోవడమే అనే టాక్ బలంగా పాతుకుపోయింది. ఇక కౌశల్ కి వ్యతిరేఖంగా తేజు, భాను, బాబు గోగినేని, నందిని రాయ్ లాంటి వాళ్ళు పెట్టుకుని ఫైనల్స్ లో ఉండాల్సినోళ్లు కాస్తా ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం కౌశల్ నామినేషన్ లో ఉండి ఎలిమినేషన్స్ నుండి తప్పించుకుంటూ… బలమైన కంటెస్టెంట్ గా హౌస్ లో ఎదిగాడు. ఆఖరుకి నాని కూడా కౌశల్ ని ఏమనాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ ని బిగ్ బాస్ టార్గెట్ చేసి అతన్ని బలహీన పరిచి… బయట కౌశల్ ఆర్మీకి షాకిచ్చే పనిలో ఉండగా… ఇండస్ట్రీలో మాత్రం కౌశల్ ఒక సెలేబ్రిటిగా మారాడు. ఇక బిగ్ బాస్ ఫైనల్స్ లో కౌశల్ పక్కా అనే విషయం తేలిపోయింది. అయితే ప్రస్తుతం కౌశల్ టివి సీరియల్స్ లో విలన్ కేరెక్టర్స్ చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటికొచ్చేసరికి కౌశల్ ని వెతుక్కుంటూ అతనికి బోలెడన్ని అవకాశాలు వచ్చేలా కనబడుతున్నాయి. అందులో మొదటగా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి చూపు కౌశల్ మీద పడినట్లుగా ఒక వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కౌశల్ కి ఒక నెగెటివ్ రోల్ ఇవ్వాలని…. కౌశల్ బిగ్ బాస్ గేమ్ ని బోయపాటి చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి హీరో ఆది పినిశెట్టిని బోయపాటి పక్కా స్టైలిష్ విలన్ గా సరైనోడు సినిమాలో చూపించాడు. అలాగే తాజాగా చరణ్ సినిమాలో ఆర్యన్ రాజేష్ ని కూడా నెగెటివ్ కేరెక్టర్ లో చూపించబోతున్నాడనే టాక్ ఉంది. మరి కౌశల్ ని కూడా బోయపాటి ఊర మాస్ విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడా.. అంటే అవుననే అంటుంన్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కౌశల్ మంచి బోడి ఫిట్నెస్ తో అదరగొడుతున్నాడు. అలాంటి కౌశల్ ని విలన్ గా చూపించే ఆలోచనలో బోయపాటి ఉన్నాడని అంటున్నారు. అయితే ఈ న్యూస్ కౌశల్ సన్నిహితులు స్ప్రెడ్ చేసారని… కాదు కౌశల్ ఆర్మీ కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యేలా ఇలాంటి న్యూస్ లు సోషల్ మీడియాలో వదులుతున్నారు ఇలా రకరకాల మాటలైతే జోరుగా వినబడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*