రోజుకో పోస్టర్ తో హడలెత్తిస్తున్నారు!!

విజిల్

తమిళనాట క్రేజీ కాంబో గా తెరకెక్కుతున్న బిగిల్ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భీభత్సమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే బిగిల్ దర్శకుడు అట్లీ తో హీరో విజయ్ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు గనక. వారి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన తేరి, మెర్సెల్ బ్లాక్ బస్టర్ హిట్ గనక. తేరి బ్లాక్ బస్టర్ హిట్. కానీ మెర్సెల్ యావరేజ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా. విజయ్ క్రేజ్ అలాంటిది. తాజాగా మూడో సినిమాగా వీరి కాంబోలో వస్తున్న బిగిల్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదల చేస్తున్నబిగిల్ పోస్టర్లు చూస్తుంటే… ఈ సినిమా ఓ రేంజ్ హిట్ అవడం ఖాయంగా కనబడుతుంది.

 

బిగిల్

రోజుకో పోస్టర్ తో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాట విజయ్ నెంబర్ వన్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇక రజినీకాంత్ తర్వాత విజయ్ కే అభిమాన గణం ఎక్కువ. తాజాగా పోస్టర్లు చూస్తుంటే ఈ సినిమాతో విజయ్ రజినీకాంత్ ని దాటెయ్యడం ఖాయంగానే కనబడుతుంది. ఇక ఈ సినిమాపై విజయ్ క్రేజ్ ఒక ఎత్తు అయితే, అట్లీ దర్శకత్వంతో పాటుగా హీరోయిన్ నయనతార కూడా ఓ ఎత్తు ప్రస్తుతం భారీ క్రేజున్న నయనతార బిగిల్ సినిమా హీరోయిన్ కావడం కూడా సినిమా మీద క్రేజ్ పెరగడానికి కారణమే. టు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్న విజయ్.. ఒక పాత్రలో ఫుడ్ బాల్ ప్లేయర్ గా, ఇంకో పాత్రలో మాస్ యాంగిల్ లోను కనిపిస్తున్నాడు. మరి సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ లుక్స్ కే ఫాన్స్ ఇంత హంగామా చేస్తుంటే, టీజర్, ట్రైలర్ విడుదలైతే ఆ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*