బాలీవుడ్ హీరోయిన్ కి ఓ వింత అనుభూతి ఎదురైంది!

బాలీవుడ్ bollywood

బాలీవుడ్ వాళ్ళు ఏదైనా ఓపెన్ గా మాట్లాడేస్తారు అనేదానికి ఇదే నిదర్శనం. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ‘‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’లో టైగర్‌ ష్రాఫ్‌, అనన్యా పాండే, తారా నటించిన ఈసినిమాను పునీత్‌ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. మే 10 న గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈసినిమా వసూళ్లు పరంగా పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యాక థియేటర్ లో చూస్తున్న సమయం లో తారాకు ఎదురైన చిత్రమైనర అనుభవం గురించి  ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

నేను ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమాను ఇద్దరు అమ్మాయిలు పక్కన కూర్చుని చూసాను. నేను వాళ్ళ పక్కన కూర్చున్న అని వారికి తెలియదు. అయితే వారు సినిమా చూస్తున్నప్పుడు సినిమాలోని ఓ సన్నివేశం చూసిన తర్వాత నా గురించి చాలా చెడ్డగా మాట్లాడారు. నేను పక్కన ఉన్న సంగతి వారికి అసలు తెలియదు. సినిమా మొత్తం పూర్తయ్యాక లైట్స్ వేశారు..నేను వాళ్ళ వైపు చూసా వాళ్ళు నా వైపు చూసి షాక్ అయ్యారు. నేను నవ్వి, పక్కకు వచ్చేశా’ అని తార చెప్పింది. ఇది విన్నాక ఇటువంటివి కూడా జరుగుతాయా అనిపించింధి కదూ..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*