చిరు ‘రౌడీ’.. పవన్ ‘తమ్ముడు’.. కలిపి..

రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాతో ప్రేక్షకులు మెచ్చే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. తన తదుపరి సినిమాని కూడా ‘రంగస్థలం’ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా ఉండే హిట్ కొట్టాలనే కసితో బోయపాటి దర్శకత్వంలో తన 12 వ సినిమాని చేస్తున్నాడు. యాక్షన్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా డి వి వి దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ హీరోయిన్ కైరా అద్వానీ, రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ప్రస్తుతం ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా టైటిల్ గాని, ఈ సినిమా లుక్ గాని ఇంతవరకు బయటికి రానివ్వలేదు చిత్ర బృందం. తాజాగా రామ్ చరణ్ – బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే చిరు బ్లాక్ బస్టర్ ‘స్టేట్ రౌడీ’ టైటిల్ ని రామ్ చరణ్ #RC12 కి పెడుతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ టైటిల్ పెట్టడం లేదంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా చరణ్ RC12 కి పవన్ కళ్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అయిన తమ్ముడు సినిమా టైటిల్ పరీశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందులోను చిరు బ్లాక్ బస్టర్ మూవీ, పవన్ హిట్ మూవీ టైటిల్ కలిపి ‘రౌడీ తమ్ముడు’ అనే టైటిల్ ని రామ్ చరణ్ RC12 కి పెట్టబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. కుటుంబ నేపథ్యమున్న కథ కావడం… చరణ్ చేస్తున్నది తమ్ముడి క్యారెక్టర్ కావడం.. బోయపాటి మార్క్ యాక్షన్ కంటెంట్ కలిగివుండడం.. తో ఈ సినిమాకి ‘రౌడీ తమ్ముడు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.

ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్ లకి తమ్ముడిగా చరణ్ కనిపించబోతున్నాడనే టాక్ ఉండనే ఉంది. అందుకే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్, చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీస్ టైటిల్స్ కలిపి రామ్ చరణ్ RC12 కి పవర్ ఫుల్ టైటిల్ గా ఫిక్స్ చేయాలన్నది దర్శకుడు బోయపాటి, రామ్ చరణ్ ఆలోచనట. మరి బోయపాటి మార్క్ మాస్ టైటిల్ తో రామ్ చరణ్ ‘రౌడీ తమ్ముడు’తో 2019 సంక్రాంతికి దడదడ లాడించబోతున్నాడన్నమాట. ఇక చెర్రీ టైటిల్ అండ్ లుక్ కోసం మెగా ఫాన్స్ ఎప్పటినుండో వెయిటింగ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*