ఖ‌రీదైన ఫైట్ తీస్తున్న బోయ‌పాటి

రామ్ చరణ్

సినిమాలో ఫలానా సీన్ హైలైట్ అవుతుందని డైరెక్టర్స్.. నిర్మాతలకు చెప్తే నిర్మాతలు ఏమి ఆలోచించకుండా డబ్బు ఖర్చుపెడుతున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ ‘సాహో’ విషయంలో అదే జరిగింది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ కోసం నిర్మాతలు ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రభాస్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అంత ఖర్చు చేశారు నిర్మాతలు.

రెండు నిమిషాల‌కు ఐదు కోట్లు

అలానే బోయపాటి – రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి కూడా అదే జరిగింది. ఈ చిత్రంలో ఓ ఫైట్ సీన్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. చరణ్ కు మాస్ ఫాలోయింగ్ ఉండటంతో.. బోయపాటి మీద నమ్మకంతో నిర్మాత ఖర్చుకు వెనకాడ్డం లేదట. అయితే ఆ 5 కోట్ల రూపాయల ఖరీదైన ఫైట్ ను ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ సీన్ సినిమాలో కేవలం 2 నిమిషాలు మాత్రమే కనిపించనుందట. ‘రంగస్థలం’ సినిమాతో చరణ్ కు మార్కెట్ పెరిగింది. చరణ్ మీద నమ్మకంతోనే బోయపాటి ఎంత అడిగితే అంత ఖర్చు చేస్తున్నాడట దానయ్య. ఈ సినిమా వచ్చే సంక్రాంతి రిలీజ్ అవుతుంది నిన్న ఆఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*