Sat Apr 27 2024 01:39:45 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్ చూశారా..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బయోపిక్ జోరు టాలీవుడ్ లో ఎక్కువవుతోంది. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరో ఎన్టీఆర్ బయోపిక్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా ‘యాత్ర’ పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర ‘చంద్రోదయం’ పేరుతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బయోపిక్ ఆఫ్ లివింగ్ లెజెండ్’ అనేది ఉపశీర్షిక. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని మేకర్స్ తెలిపారు. వినోద్ నవ్వుల చంద్రబాబు పాత్రలో, భాస్కర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను శనివారం విడుదల చేశారు.
Next Story