చరణ్ కు ఇంతకు మించి పెద్ద గిఫ్ట్ ఏం కావాలి?

రామ్ చరణ్ Ram charan telugu post telugu news

తన డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా ను తన కొడుకు రామ్ చరణ్ నిర్మించడంతో తెగ ఆనంద పడిపోతున్నాడు చిరంజీవి. గత కొన్ని రోజులు నుండి చిరు పుత్రోత్సహంతో పొంగిపోతున్నారు. వందల కోట్లు పెట్టి తన డ్రీం ప్రాజెక్ట్ ను నిర్మించిన చరణ్ ను చిరు పొగడ్తలతో ముంచేస్తున్నారు. చిరు ఎక్కడ కి వెళ్లిన ఏ ఫంక్షన్ కి వెళ్లిన రామ్ చరణ్ గురించి చెప్పడం ఆపట్లేదు.

అయితే నిన్న జరిగిన సైరా ప్రెస్ మీట్ లో ఓ విలేకరి….మీకు చరణ్ ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు కదా…మరి మీరు చరణ్ కి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తారు? అని అడిగిన ప్రశ్నకు చిరు ఇలా సమాధానం ఇచ్చారు. వాడికి నేను జన్మనిచ్చాను అంత కంటే పెద్ద బహుమతి ఏముంటుంది అన్నారు.

చరణ్ కు నేను తన వెనకున్న అనే ధైర్యం తోనే అన్ని కోట్లు ఖర్చుపెట్టాడని చిరు మాటల్లో మాటగా అసలు విషయం బయటపెట్టారు. ఇక చిరు నెక్స్ట్ కొరటాల డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది. దీనికి కూడా చరణే నిర్మాత. త్వరలోనే ఇందులో ఇందులో నటించే నటీనటులు గురించి తెలియనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*