చిరంజీవితో సినిమాపై క్లారిటీ..!

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఈ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా డీటెయిల్స్ ఆఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా వైజయంతీ మూవీస్ నుండి రీసెంట్ గా ‘మాహానటి’ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయనకు చాలామంది నిర్మాతల నుండి మంచి ఆఫర్స్ వచ్చాయట తమ బ్యానర్ లో సినిమాలు చేయమని. కానీ నాగ్ అశ్విన్ అవి ఏమి ఒప్పుకోకుండా వైజయంతీ మూవీస్ లోనే మరో సినిమా చేయనున్నాడట .

సగర్వంగా చెబుతామన్న అశ్వినీదత్

అందుకుగాను అశ్విన్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. ఇది స్క్రిప్ట్ మొత్తం పూర్తి అవ్వగానే అది ఆయనకి తగినట్టుగా ఉందని అనిపిస్తే అప్పుడు ఆ ప్రాజెక్టును గురించి ఆలోచిస్తామని అశ్వనీదత్ అన్నారు. అయితే అది నిజం కాదని కేవలం పుకారులే అని చెబుతున్నారు. రీసెంట్ గా వైజయంతీ మూవీస్ వారు ఇందులో నిజం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇంతవరకు చిరంజీవితో మేము 4 బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాము. అయితే ఆయనతో ఐదవ సినిమా చేసే ఛాన్స్ వస్తే అంతకన్నా సంతోషం ఏముంది. కానీ ఇప్పటివరకు ఆయనతో ఐదవ సినిమా చేసే ఛాన్స్ రాలేదు. వస్తే ఆ విషయాన్ని మేమే సగర్వంగా తెలియజేస్తాము’’ అని చెప్పుకొచ్చారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*