చిరంజీవి లుక్ మారబోతుందా?

చిరంజీవి chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చాలా బొద్దుగా ఉన్నారు. తన రీఎంట్రీ సినిమా  ఖైదీ నెం 150తో పోలిస్తే ఆయ‌న లావ‌య్యార‌నే చెప్పాలి. సైరా కోసం ఆయన లావు అయ్యారు. ఈసినిమా కోసం ఆయన లావు అయిన పర్లేదు ఎందుకంటే ఇది ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి గురించి కాబట్టి ఆ భారీ తనం ఉంటుంది. కానీ చిరు చేసే నెక్స్ట్ సినిమా కోసం అయితే కచ్చితంగా తగ్గాలి. ఇలా ఉంటె కుదరదు. అవును చిరు నెట్స్ కొరటాల డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా లో క‌మ‌ర్షియ‌ల్ ఎలెమెంట్స్ ఉంటాయి కాబట్టి అభిమానులు చిరు ని ఒక హీరోలా చూడాలనుకుంటారు కాబట్టి కచ్చితంగా చిరు వెయిట్ లాస్ అవ్వాల్సిందే.

ఫైట్స్ చేస్తున్నప్పుడు, డాన్స్ వేస్తున్నప్పుడు లావు ఉంటె బాగోదు కదా అందుకే తగ్గాలి. కొర‌టాల కూడా `మీరు బ‌రువు త‌గ్గాలి` అంటూ ప‌దే ప‌దే గుర్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సైరా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే చిరు తన వెయిట్ లాస్ పై కాన్సంట్రేట్ చేస్తారని తెలుస్తుంది. కొరటాల మూవీ కోసం చిరు ఏకంగా 15 కిలోలైనా బ‌రువు త‌గ్గాల‌ని, అందుకోసం ప్ర‌త్యేక‌మైన డైట్‌, వ్యాయామాలు మొద‌లెడుతున్నార‌ని, చిరు కోసం ఓ ట్రైన‌ర్‌ని చ‌ర‌ణ్ నియ‌మించాడ‌ని తెలుస్తోంది. ఇందులో చిరు రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర బొద్దుగా ఉన్న పర్లేదు కానీ మరొక పాత్ర స్లిమ్ గా ఉండాలట. అందుకే ఈ తిప్పలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*