చిరు అండ్ ప్రభాస్ పోటాపోటీ

సై రా నరసింహ రెడ్డి Chiranjeevi Syra Prabhas Sahoo to release on August 15 2019

మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమా యొక్క టీజర్ కు రీసెంట్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడాయి. దీనికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఈనేపధ్యంలో ఈసినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. దాని తగ్గ పనులు కూడా చకచక చేస్తునట్టు టాక్. ఇది ఇలా ఉండగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘సాహో’ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.

ఈసినిమాని కూడా అదే రోజు అంటే ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇదే కనుక నిజం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ మాములుగా ఉండదు. ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ తన మార్కెట్ ను ఇండియా వైడ్ ఓపెన్ చేసాడు. సాహో హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిపై అంచనాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. సో ఈసినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఆలా ఆగస్టు 15 న ఇద్దరికి పోటీ తప్పేలా లేదు. పోటీ ఎందుకులే అని ఇద్దరిలోనుండి ఎవరన్న వెనక్కి తగ్గుతారేమో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*