కళ్యాణ్ తో నేను సినిమా చేయడానికి సై

janasena may win gajuwaka

ప్రస్తుతం సైరా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తూ స్టాండర్డ్ గా వెళ్తుంది. తమ సినిమాని ఇంకా ప్రమోట్ చేసుకోవాలనే ఉదేశంతో టీం అంత నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కి చిరంజీవి తో పాటు సురేంద్ర రెడ్డి, నటుడు రవి కిషన్, సాయి చంద్, రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా వాళ్ళు వేసిన ప్రశ్నలకు యూనిట్ సభ్యులు సమాధానాలు చెప్పడం జరిగింది.

అయితే అందులో ఒకరు…మంచి సోషల్ అండ్ పొలిటికల్ కాన్సెప్ట్ ఉన్న కథతో వస్తే పవన్ కళ్యాణ్ గారితో కలిసి మూవీ చేస్తారా? అని అడుగగా చిరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కచ్చితంగా మంచి కథ వస్తే చేస్తా. నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్దమే అని ఆయన కుండ బద్దలు కొట్టారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. పవన్ కు చాలామంది నిర్మాతలు నుండి ఆఫర్స్ వచ్చాయి కానీ దేన్నీ యాక్సిప్ట్ చేయలేదు. కానీ సమకాలీన రాజకీయ పరిస్థితులు, సోషల్ మెస్సేజ్ కలిగిన సినిమాలు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ఉపయోగపడే అవకాశం ఉండటంతో ఆయన మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకున్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు కొంతమంది. మరి ఆ కథ ను ఎవరు రెడీ చేస్తారో చూడాలి. ఆమధ్య సుబ్బిరామి రెడ్డి పవన్ కళ్యాణ్ ని చిరు ని పెట్టి సినిమా చేస్తున్న అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ ప్రస్తుతం దాని గురించి ఎవరు మాట్లాడడంలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*