సైరా కోసం చిరు డైరెక్టర్ అవతారం

సైరా ఎఫెక్ట్

రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈసినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈసినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఫిలింనగర్ సమాచారం ప్రకారం చిరు ఒక గంట‌ డైరెక్ట‌ర్ అవ‌తారం ఎత్తాడని తెలుస్తుంది.

అది కూడా ‘సైరా’ కోసం అంట. సురేంద్ర రెడ్డి ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఒక రోజు సురేంద్ర రెడ్డి సెట్స్ కి ఒక గంట లేట్ గా వచ్చాడట. దాంతో చిరు అప్పటికే సెట్స్ లో ఉండటంతో ఆ రోజు తీయాల్సిన సన్నివేశం చదివి ఆ సన్నివేశంను డైరెక్ట్ చేసాడట. సురేంద్ర రెడ్డి వచ్చేప్పటికి చిరు కెప్టెన్ చైర్ లో కూర్చుని డైరెక్ట్ చేయడం చూసి డిస్ట్ర‌బ్ చేయ‌డం ఇష్టం లేక‌, షాట్ అయ్యేంత వ‌ర‌కూ ఆ ప‌క్క‌నే నిల‌బ‌డి చూశాడ‌ని స‌మాచారం.

అయితే చిరు ఇలా డైరెక్ట్ చేయడం కొత్తఏమి కాదు. గతంలో చాలా సినిమాలు ఇలానే డైరెక్ట్ చేశాడు. ‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో కొన్ని స‌న్నివేశాల్ని కూడా చిరు ఇలానే డైర‌క్ట్ చేశాడు. ఇప్పుడు మరోసారి డైరెక్టర్ అవతారం ఎత్తాడు. 152 వ చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కు సిద్ధం అవుతుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*