గొడవలు పెట్టి ఎంజాయ్ చేసేవాడు బాబాయ్: సుష్మిత

pawan kalyan

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు మరెంతో టైం లేదు. ఆయన పుట్టిన రోజున చిరు సై రా సినిమా లుక్ వదులుతున్నారు. అయితే ఈ మధ్యలో సండే స్పెషల్ గా ఒక డైలీ పేపర్ చిరంజీవి గురించి ఆయన కూతుళ్లు సుష్మిత, శ్రీజాలను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో ఆయన కూతుళ్లు ఇద్దరు చిరంజీవి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పడమే కాదు.. తమ చిన్నాన్న పవన్ గురించిన కబుర్లు కూడా ఆ పత్రికతో పంచుకున్నారు. తమ తండ్రితో తమ అనుబంధం ఎలా ఉంటుందో చెప్పిన వీరిద్దరూ తమ బాబాయ్ పవన్ గురించిన ఆసక్తికర సంఘటన చెప్పింది సుష్మిత.

తమ ఇంట్లో తాను తన చెల్లి శ్రీజ, తమ్ముడు రామ్ చరణ్ లలో…. తాను తన తమ్ముడు చరణ్ బాగా కొట్టుకునే వాళ్లమని.. తన చెల్లి శ్రీజ మాత్రం అస్సలు అల్ల్లరి చేసేది కాదని.. మేమిద్దరం కొట్టుకుంటుంటే.. శ్రీజ మాత్రం సైలెంట్ గా ఒక మూల కూర్చునేదని చెప్పిన సుష్మిత… తనకి తన తమ్ముడు చరణ్ కి తన చిన్నాన్న పవన్ కళ్యాణ్ గొడవలు పెట్టి ఆ ఫన్ ని ఎంజాయ్ చేసేవాడని చెప్పింది. తమ్ముడు చరణ్ కి తనకి మధ్యలో పవన్ బాబాయ్ ఏదో ఒకటి చెప్పి గొడవలు పెట్టేవాడిని.. అలాగే తమతో కలిసి అల్లరి చేసేవాడని.. అసలు ఇంట్లో సగం గొడవలు తమ బాబాయ్ పవన్ వల్లే జరిగేవని చెప్పింది సుష్మిత.

అలా మేమిద్దరం గొడవ పడుతుంటే తమ బాబాయ్ తెగ ఎంజాయ్ చేసేవాడని… అలాగే శ్రీజ మా ఇద్దరిలో ఎవరికీ సపోర్ట్ చేసేది కాదని.. కానీ శ్రీజ మాత్రం మోస్ట్‌ క్వాలిఫైడ్‌ అని తమకంటే బాగా చదువు కుందని చెప్పింది. ఇంకా చిరంజీవి విదేశాలకు షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు తమతో పాటుగా బన్నీ, సాయి ధరం, ఇంకా చాలామంది కజిన్స్ కి బోలెడన్ని గిఫ్ట్స్ తెచ్చేవారని.. ఆయన మిడ్ నైట్ ఫ్లైట్ కి కి వచ్చినా చిరు రాక కోసం అందరం ఎదురు చూసేవారమని.. చిరు కూతుళ్లు శ్రీజ తో పాటుగా సుష్మిత చెబుతున్న మాటలు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*