చిరు ఫ్యాన్స్ ని నిరాశపరిచే న్యూస్ !

చిరంజీవి chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే తన ఫ్యాన్స్ ఆశించే ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. సాంగ్స్, సాంగ్స్ లో స్టెప్స్, రెండుమూడు ఫైట్స్ ఉంటే చాలు జనాలు రిపీటెడ్ గా సినిమా చూసేస్తారు. కానీ చిరు ప్రస్తుతం ఓ స్వాతంత్ర నేపథ్యంలో వచ్చే సినిమా చేస్తున్నాడు. ఇది ఒక తెలుగు వీరుడి కథ. ఇదో హిస్టారికల్ ఫిలిం కాబట్టి ఇందులో యాక్షన్ సీక్వెన్సులకు చోటు ఉంటుంది. ఇందులో పాటలు, డ్యాన్సులుండవు.

అందులో మూడే పాటలు….

సైరా చిత్రంలో పాటలు ఉండాలని కోరుకునేవారికి ఇదొక బాడ్ న్యూస్. ఇందులో కేవలం మూడు సాంగ్స్ మాత్రమే ఉంటాయని అందులో ఒక సాంగ్ నేపథ్యంలో వినిపించే పాట అని దర్శకుడు సురేందర్ రెడ్డి రీసెంట్ గా వెల్లడించారు. అంటే మిగిలింది. రెండు సాంగ్స్ మాత్రమే. ఈ మూడు పాటలకు సిరివెన్నెల సాహిత్యం అందించారట. ఈ సాంగ్స్ ని కంపోజ్ చేసింది బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది. ఇది హిస్టారికల్ ఫిలిం కాబట్టి అవసరం అయిన చోట సాంగ్స్ వస్తే బెటర్. అలా వస్తే సినిమా కథను డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది.

చిరుతో అమితాబ్, నయనతార….

అదే పనిగా సాంగ్స్ వస్తుంటే ప్రేక్షకులకి చిరాకు వచ్చి సినిమాలో నుండే వెళ్లిపోయే అవకాశముంది. సో ఆ సాంగ్స్ అందరికి నచ్చే విధంగా ఉంటే బెటర్. ఇక ఈమూవీ అక్టోబర్ 2 న రిలీజ్ అవుతుంది. చిరు సరసన నయనతార నటిస్తుంది. మరో ముఖ్య పాత్రల్లో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ నటిస్తున్నారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*