పూరి కి బ్యాంకాక్ పంచ్ వేసిన చిరు?

puri jagan back to form

చిరంజీవి – పూరి జగన్నాధ్ కాంబోలో ఆటో జానీ సినిమా ఉంటుంది అని చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు పూరి జగన్నాధ్ తో పవన్ కళ్యాణ్ తో సినిమా అంటున్నారు. పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో పూరి – పవన్ సినిమా ఉంటుంది అని అందులో పవన్ కళ్యాణ్ ని సీఎం గా పూరి చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా పూరి జగన్నాధ్ కి చిరు అదిరిపోయే పంచ్ వేసాడు. ఆ పంచ్ అలాంటి ఇలాంటి పంచ్ కాదండోయ్…

చిరంజీవి సోషల్ మీడియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా సినిమా ప్రముఖులు అంతా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అందులో భాగంగా పూరి జగన్నాధ్ కూడా చిరు కి స్వాగతం పలుకుతూ.. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మీకు స్వాగతం సార్. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తున్న తరుణంలో సోషల్ మీడియా మనల్ని ఇలా దగ్గర చేస్తుంది అంటూ ట్వీట్ వేసాడు. దానికి చిరు కూడా ఫన్నీగా థాంక్యూ పూరీ …. కరోనా కారణంగా అందరికి మంచి ఫ్యామిలీ టైమ్ లభిస్తోంది. కానీ నీవు ముంబై, బ్యాంకాక్ బీచ్ లను మిస్ అవుతావేమో కానీ… నీ పిల్లలు పవిత్ర, ఆకాశ్ మాత్రం నీతో సమయాన్ని గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు అంటూ పూరి కి బ్యాంకాక్, ముంబై అంటే ఎంతిష్టమో తెలియజేస్తూ చిరు పూరికి ఫన్నీ పంచ్ వేసాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*