‘చిత్రలహరి’కి క్రేజ్ బాగానే ఉందే..!

సాయితేజ్

సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య వరుస పరాజయాలు అందుకోవడంతో మార్కెట్ కూడా బాగా పడిపోయింది. అయితే ఆ ప్రభావం తన కొత్త చిత్రంపై పడలేదు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నేను శైలజ ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ‘చిత్రలహరి’ అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల వరకు జరిగింది.

మళ్లీ ఫామ్ లోకి వస్తాడా

నైజాంలో ఈ మూవీని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనుండగా ఓవర్సీస్ హక్కులను సరిగమ సినిమాస్ సొంతం చేసుకుంది. ఒకవేళ ఈ చిత్రం హిట్ అయితే తేజు మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ నటిస్తున్నారు. ఎమోషనల్ ఎంటర్టైనేర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12 న విడుదల చేయనున్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*