‘వాటా’ పేరుతో మనల్ని నవ్వించనున్న శ్రీను వైట్ల

Sreenu Vaitla film with manchu vishnu

శ్రీను వైట్ల సినిమాలకు కామెడీ కోసమే చాలామంది వెళ్తారు. అతని కామెడీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. వారికి సినిమా ఎలా ఉన్న కానీ పట్టించుకోరు..సినిమాలో రెండు మూడు కామెడీ ఎపిసోడ్స్ బాగుంటే చాలు హిట్ అనేస్తారు. అలానే శ్రీను వైట్ల సక్సెస్ అయ్యాడు. ఉదాహరణకు రవితేజ దుబాయ్ శ్రీను సినిమాలో ఎమ్మెస్ నారాయ‌ణ ఎపిసోడ్ గుర్తుంది క‌దా? అందులో హీరోలపై వేసే సెటైర్‌స్ ఎంత క్లిక్ అయిందో తెలిసిన విషయమే.

అలానే ‘దూకుడు’ లో కూడా ఎమ్మెస్ ఎపిసోడ్ బాగా క్లిక్ అయింది. అయితే మరోసారి అటువంటి ఎపిసోడ్ తో మనల్ని ఎంటర్టైన్ చేయనున్నాడు శ్రీను. శ్రీను రూపొందించిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ`లోనూ ఓ సెటైరిక‌ల్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశాడు. అమెరికాలో నాట..తానా అనే తెలుగు సంఘాలు ఉన్న సంగతి తెలిసిన విషయమే. అయితే శ్రీను వైట్ల వాటిని ఫోకస్ చేస్తూ ‘వాటా'(ఓల్ ఆంధ్రా తెలంగాణ అసోసియేష‌న్‌) అనే పేరుతో మనల్ని ఎంటర్టైన్ చేయనున్నాడు.

సునీల్‌, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ర‌ఘుబాబు, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి లాంటి కమెడియన్స్ ను ఉపయోగించి ఓ హిలేరియ‌స్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశాడట శ్రీ‌నువైట్ల‌. దాదాపు 5 నిమిషాలు సాగే ఈ ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. ఇదే ఎపిసోడ్‌లో సినిమావాళ్ల‌పైనా కొన్ని సెటైర్లు వేశాడ‌ట శ్రీ‌ను మరి ఈనెల 16 న రిలీజ్ అవ్వబోతున్న `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` లో ఈ ఎపిసోడ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*