చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పింది..!

113 రోజులుగా స్టార్ మాలో ప్రతి రోజు రాత్రి ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 2 మొన్న ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగిసినప్పటికీ.. ఇంకా బిగ్ బాస్ గురించిన ముచ్చట్లు మాత్రం ఫిలిం సర్కిల్స్ దగ్గర నుండి ప్రేక్షకుల వరకు ఆగలేదు. ఇక కొంతమంది మూడున్నర నెలలుగా బిగ్ బాస్ కి అడిక్ట్ అయ్యి ఇప్పుడు తొమ్మిదిన్నరకి బిగ్ బాస్ రావడం లేదంటూ నిరాశ పడుతున్నారు. ఆ టైంలో బిగ్ బాస్ చూసే వాళ్లం ఇప్పుడేం చూడాలంటున్నారు. ఇక ప్రేక్షకుల తీరు ఆలా ఉండగా.. బిగ్ బాస్ విన్నర్ అయిన కౌశల్ మాత్రం ఛానల్స్ లో, బిగ్ బాస్ బయట కౌశల్ ఆర్మీ అంటూ హడావుడి చేసిన వాళ్లతో మీట్ అవుతూ బిజీ బిజీగా ఉంటూనే హౌస్ మేట్స్ మీద ఇంకా బ్యాడ్ ఒపీనియన్ తోనే ఉన్నాడు. తనకి ఎవరూ సాటిలేరని.. తానొక్కడే బిగ్ బాస్ కి అర్హుడినంటూ మాట్లాడుతున్నాడు.

ఓట్లతో సంబంధం లేకుండానే…

కానీ ఫైనల్ నుండి ఎలిమిలేషన్ ద్వారా బయటికొచ్చిన వారు మాత్రం కౌషల్ ని ఒక్క మాట కూడా అనడం లేదు. ఇక బిగ్ బాస్ లో మొదటి నుండి మంచి ఆటతీరు కనబర్చిన దీప్తి నల్లమోతు ఫైనల్ విన్నర్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తుందనుకున్నారు చాలామంది. అలాగే కౌశల్ ఆర్మీకి పోటీగా దీప్తి ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో కాస్త హడావిడి చేశారు కూడా. అయితే, దీప్తి రన్నర్ అప్ గా నిలుస్తుందనుకున్నా… గీత మధురి సెలబ్రిటీ కాబట్టి ఆమెని రన్నర్ గా ప్రకటించారని.. ఓట్లతో సంబంధమే లేకుండా విన్నర్, రన్నర్ ని ప్రకటించారంటూ బిగ్ బాస్ మీద పలు విమర్శలు మొదలయ్యాయి. కౌశల్ ఆర్మీకి భయపడి కౌశల్ కి బిగ్ బాస్ విన్నర్ ఇచ్చారని… ఇక గీత సెలబ్రిటీ కాబట్టి రన్నర్ గా ఉంచారని.. కానీ దీప్తిని తొక్కేశారనే వాదన బయట బయలుదేరింది.

బిగ్ బాస్ ను ఆకాశానికి ఎత్తి…

అయితే తాజాగా బిగ్ బాస్ నుండి బయటికొచ్చిన దీప్తి అభిమానులతో లైవ్ చాట్ లో మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 2లో తాను పాల్గొనడం మరిచిపోలేని జ్ఞాపకం అని చెప్పింది. అంతేకాకుండా నా ఎమోషన్స్ ను, ఫైటింగ్ స్పిరిట్ చూపించిన తీరే నాకు అభిమానులను సంపాదించి పెట్టింది… అంటూ బిగ్ బాస్ ని ఆకాశానికెత్తేసింది. ఇక కొంతమంది అభిమానులు దీప్తితో మాట్లాడుతూ.. కౌశల్ తో ముందు మంచిగా ఉండి ఆ తరువాత వ్యతిరేకించడంలో ఎమన్నా ఉందా అని అడగగా.. ఆ విషయంలో అసలు నిజం లేదు. కొన్ని రకాల గేమ్స్ జరుగుతున్నప్పుడు.. ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉండాల్సి వస్తుంది. పరిస్థితులను బట్టి అలా వ్యవహరించానే తప్ప, కౌశల్ పై నాకు ఎలాంటి కక్ష లేదు.. అంటూ చాలా స్వీట్ గా సమాధానాలు చెప్పింది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*