దిల్ రాజుకు మ‌రో గాల్లో దీపం..!

dil raju comments on f2 sequel

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు అగ్ర నిర్మాత దిల్ రాజు సినిమాలు నిర్మించినా, డిస్ట్రిబ్యూట్ చేసినా ఆ సినిమా రిలీజ్‌కు ముందే స‌గం స‌క్సెస్ అయిన‌ట్టే. దిల్ రాజు జ‌డ్జ్‌మెండ్‌కు అలాంటి వేల్యూ ఉండేది. అయితే ఇటీవ‌ల రాజు వ‌రుస ఎదురు దెబ్బ‌లు తింటున్నాడు. గ‌తేడాది అత‌డు ఆరు సినిమాలకు నిర్మాత‌గా ఉన్నాడు. ఆరు సినిమాలు హిట్లు అయ్యాయి. చివ‌ర‌కు ప్లాప్ టాక్ వ‌చ్చిన నాని ఎంసీఏ సినిమా సైతం క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ములేపింది.

నిర్మాత‌గా ఓకే అనిపించుకున్న రాజు గ‌తేడాది స్పైడ‌ర్ లాంటి చిత్రాన్ని పంపిణీ చేసి భారీగా న‌ష్ట‌పోయాడు. ఇటీవ‌ల రాజు పంపిణీ చేస్తోన్న సినిమాలు వ‌రుస‌గా ఫల్టీల మీద ఫ‌ల్టీలు కొడుతున్నాయి. ఈ యేడాది ఆరంభంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా మీద భారీ అంచ‌నాల‌తో భారీ రేట్ల‌కు ఆ సినిమాను కొన్నాడు. దారుణంగా న‌ష్ట‌పోయాడు. ఇక వ‌రుస హిట్ల‌తో ఉన్న నాని కృష్ణార్జున యుద్ధంతో దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ సినిమా విష‌యంలో కూడా రాజు జ‌డ్జ్‌మెంట్ పూర్తిగా లెక్క‌త‌ప్పింది.

ఇక తాజాగా వ‌చ్చిన పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి మెహ‌బూబా సినిమా అయితే సినిమా ప్ర‌ద‌ర్శ‌న హ‌క్కులు, ప‌బ్లిసిటీ ఖ‌ర్చులు కూడా రానంత డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే ఈ సినిమా విష‌యంలో కొన్ని కండీష‌న్లు ఉన్నా రాజు జ‌డ్జ్‌మెంట్ అయితే ప్లాపేగా. ఇక ఇప్పుడు రాజు నైజాం రైట్స్ ద‌క్కించుకున్న మ‌రో సినిమా విష‌యంలో కూడా అత‌డు త‌ప్పులో కాలేశాడా ? అన్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరక్కుతున్న ‘సాక్ష్యం’ సినిమాను పంపిణీ చేసేందుకు సిద్దం అయ్యాడు. నైజాం రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా టాక్‌. సాక్ష్యం సినిమా హీరోకు ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన మార్కెట్ లేదు. ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు శ్రీవాస్‌కు కూడా హిట్ లేదు. అత‌డి చివ‌రి సినిమా బాల‌య్య‌తో తీసిన డిక్టేట‌ర్ బిలో యావ‌రేజ్‌. అటు హీరో శ్రీనివాస్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్ హీరోగా త‌న‌ను తాను ఫ్రూవ్ చేసుకోలేక‌పోయాడు.

మ‌రి ఈ కాంబోలో వ‌స్తోన్న సాక్ష్యం సినిమా ఏం చేస్తుందో ? రాజు అంచ‌నాలు ఎంత నిల‌బెడుతుందో ? చూడాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 14 న రిలీజ్ చేస్తున్నారు. ఆత్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న కొత్త కాన్సెఫ్ట్ కావ‌డంతో సాక్ష్యంపై కొంద‌రిలో అంచ‌నాలు ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*