ప్లాప్ హీరోని హైప్ చేస్తున్నాడెందుకు?

దిల్ రాజు

దిల్ రాజు బ్యానర్ నుంచి ఏ సినిమా వస్తుందన్నా అందరిలో పిచ్చ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే మంచి అభిరుచి ఉన్న నిర్మాత దిల్ రాజు. ఆయన నుంచి ప్రేక్షకులు మెచ్చే సినిమాలే వస్తాయని. దిల్ రాజు ఎంతో ఇష్టపడి తమిళం నుంచి రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న 96 రీమేక్ సినిమాని తెలుగులో శర్వానంద్ – సమంత లతో సినిమా తీశాడు. షూటింగ్ పూర్తయ్యింది. ఇక 96 సినిమా ఎప్పుడెప్పుడు విడుదల చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు మాత్రం 96 సినిమా రీమేక్ విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. ఆఖరుకి సినిమా టైటిల్ గాని, విడుదల డేట్ గాని ఇవ్వకుండా దిల్ రాజు తెగ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు.

ఇద్దరి లోకం ఒకటే….

ఆ సినిమాని వదిలేసి ప్లాప్ హీరో రాజ్ తరుణ్ సినిమాని క్రిస్మస్ రేసులోకి తీసుకొస్తున్నాడు. రాజ్ తరుణ్ షాలినీ పాండే జంటగా నటించిన ఇద్దరి లోకం ఒకటే సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని సమాచారం. మరి ఇప్పటికే భీష్మ, రూలర్, డిస్కో రాజా, ప్రతి రోజు పండగే సినిమాలు గట్టి పోటీకి వస్తున్నప్పటికీ.. దిల్ రాజు ఇద్దరి లోకం ఒకటే సినిమాని క్రిస్మస్ బరిలోకి దింపుతున్నాడు అంటే ఆయనకు సినిమా మీద ఎంత నమ్మకముండాలి. అసలైతే 96 రీమేక్ నే క్రిస్మస్ కి విడుదల చేద్దామనుకుంటే… షూటింగ్ పూర్తయినా…. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందని 96ని వదిలేసి ప్లాప్ హీరో రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అని ముందుకు తీసుకొస్తున్నాడు దిల్ రాజు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*