బయ్యర్స్ భయపడుతున్నారు

Allu Arjun Mahesh babu telugu news telugu post telugu cinema news

సైరాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఓవర్సీస్ లో వసూళ్లు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెరికాలో రెండున్నర మిలియన్లని చేరుకుంది. అయితే మూడు మిలియన్లు సాధిస్తుందా లేదా అనేది అనుమానంగానే వుంది. దానికి కారణం అక్కడ మార్కెట్ పూర్తిగా క్షిణించడమే కారణం అని అంటున్నారు. దాంతో సంక్రాంతికి కి రిలీజ్ అయ్యే రెండు భారీ చిత్రాలకి తగ్గ వసూళ్లు అమెరికాలో వస్తాయా అనే అనుమానం నెలకొంది.

కలెక్షన్లకు టెన్షన్….

మహేష్ సరిలేరు నీకెవరు తో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలకి కలిపి అయిదు మిలియన్‌ డాలర్లు వసూలయితే కానీ బ్రేక్‌ ఈవెన్‌ కావు. మరి ఇప్పుడున్న పరిస్థితిల్లో అంత సాధించడం కష్టమే అంటున్నారు. ముందుగానే అంత పెట్టి ఇన్వెస్ట్ చేసి తప్పు చేశామోనని బాధ పడుతున్నారు అక్కడి బయ్యర్స్. సైరా రిలీజ్ అయ్యే
వరకు వేచి చూసినట్టయితే అక్కడి బయ్యర్లు ఇంత పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్‌ చేసి వుండేవారు కాదేమో అని అంటున్నారు. కానీ మహేష్ కి అక్కడ మార్కెట్ బాగానే ఉంది. మరి రెండు మిలియన్లు సాధించడం పెద్ద కష్టం కాదని మరోపక్క భావిస్తున్నారు. పైగా మహేష్ సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది కాబట్టి కచ్చితంగా పెట్టిన ఖర్చు వెనక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు. అలానే అల్లు అర్జున్ సినిమా కూడా.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*