‘ఎఫ్ 2’ స్పెషల్ సాంగ్ లో బ్యూటీ..!

varun and venkatesh in f2

వెంకటేష్ – వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఎఫ్ 2’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే నెల సంక్రాంతికి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక్క ఐటెం సాంగ్ తప్ప దాదాపు షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే ఆ సాంగ్ ని కూడా షూట్ చేయనున్నారు. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ మాస్ సాంగ్ లో ఎవరు డాన్స్ వేస్తారు అనుకున్న టైంలో అనసూయ పేరు బయటికి వచ్చింది. వెంటనే ఆమెను సంప్రదిస్తే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాంగ్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు టీం. వెంకటేష్ – వరుణ్ తేజ్ – అనసూయలపై ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

మాస్ ఆడియన్స్ కోసం…

ఈ స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్, వెంకీకి జోడిగా తమన్నా నటిస్తున్న ఈ సినిమా… నాన్ స్టాప్ నవ్వులతో కొనసాగుతుందని చెబుతున్నారు. అనిల్ రావిపూడి కామెడీని డీల్ చేయడంలో ఎక్స్పర్ట్. వరస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ ఈ సినిమాతోనూ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడని ప్రేక్షకులతో పాటు దిల్ రాజు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*