ఈ కుర్రోడి జోరు మాములుగా లేదే
ఈనగరానికి ఏమైంది అంటూ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో విశ్వక్ సేన్ వన్ అఫ్ ద హీరోగా నటించాడు. ఆతరవాత తానే హీరోగా, దర్శకుడిగా ఫలక్ [more]
ఈనగరానికి ఏమైంది అంటూ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో విశ్వక్ సేన్ వన్ అఫ్ ద హీరోగా నటించాడు. ఆతరవాత తానే హీరోగా, దర్శకుడిగా ఫలక్ [more]
ఈనగరానికి ఏమైంది అంటూ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో విశ్వక్ సేన్ వన్ అఫ్ ద హీరోగా నటించాడు. ఆతరవాత తానే హీరోగా, దర్శకుడిగా ఫలక్ నుమాదాస్ సినిమా ని తెరకెక్కించాడు. ఆసినిమా కొంతమందికి నచ్చగా… కొంతమంది మాత్రం పెదవివిరిచారు. అయితే ఇప్పుడు ఈ విశ్వక్ సేన్ జోరు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఉండబోతుంది అనేది అతని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తే తెలుస్తుంది. యంగ్ హీరోలు కూడా చెయ్యని సినిమాలను విశ్వక్సేన్ చేసుకుపోతున్నాడు. ఆచి తూచి యంగ్ హీరోలు సినిమాలు చేస్తుంటే విశ్వక్సేన్ మాత్రం వరసబెట్టి సినిమాలు ఒప్పుకోవడమే కాదు…. చాలామంది హీరోలు విశ్వక్ సేన్ హీరోగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే హీరో నాని విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా ని నిరించబోతున్నాడు. తాజాగా రానా కూడా విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. విశ్వక్ సేన్ ఇప్పటికే ఫలక్‌నుమా దాస్ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ లోనే చేసాడు. అయితే గతంలో కంచర పాలెం సినిమాని సమర్పించిన రానా ఇప్పుడు విశ్వక్ సేన్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇప్పటికే కార్ట్యూన్ సినిమాతో సెట్స్ మీదున్న విశ్వక్ సేన్ జోరెలా ఉందొ చూస్తున్నాం. మరో వైపు విశ్వక్ సేన్‌తో ఎమ్.ఎస్.రాజు ఓ సినిమా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరో ఓ మాస్ హీరో ఇలా బిజీ అవడం చూస్తే మిగతా యంగ్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తడమే.