ప్రమోషన్స్ కి రాకుండా ఏడిపిస్తుందట

esha rebba movie with naga shourya

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ.. హీరోయిన్ గా చిన్న సినిమాలు చేస్తూనే ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్ గా అరవింద సమేతలో నటించింది. ఆ సినిమాలో ఈషాకి పేరు రాకపోయినా.. కోన్నాళ్లు అరవింద సమేతాని నమ్ముకుంది.. అవకాశాలు వస్తాయనుకుంది. కానీ అరవింద సమేత ఆమెకి ఎలాంటి హెల్ప్ చేయలేదు. ఇక మళ్ళీ హీరోయిన్ గా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో సినిమాలో సత్య దేవ్ సరసన నటించింది. రాబోయే ఇరవై నాలుగు గంటల్లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా విషయం పక్కనబెడితే.. ఈషా రెబ్బ ఈమధ్యన గ్లామర్ గా హాటెస్ట్ యాంగిల్స్ లో హడావిడి మొదలెట్టింది.

ఈషా ఏందీ రెబ్బ

ఎప్పుడూ ట్రెడిషనల్ గా కనబడే ఈషా రెబ్బ హాటెస్ట్ ఫోటో షూట్స్ తో తనలోని గ్లామర్ యాంగిల్ కూడా ఉందని చూపిస్తుంది. ఇకపోతే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో సినిమా ఆడియో వేడుకలో ఎన్టీఆర్ ని ఎత్తేసిన ఈషా రెబ్బ ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో దర్శకనిర్మాతలకు చుక్కలు చూపెడుతుందంట. విడుదలకు దగ్గరవుతున్న సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్ కి రాకుండా ఈషా రెబ్బ తప్పించుకుంటుందని, నిర్మాతలు కాస్త స్పెషల్ ఇంటర్వ్యూ కి రమ్మన్నా ఈషా రెబ్బ రావడం లేదంటున్నారు. మరి పెద్దగా హీరోయిన్ అవకాశాలు కూడా లేని ఈషా రెబ్బ ఇలా ఎందుకు చేస్తుందో తెలియదు కానీ.. ఆమెకొచ్చే చిన్న చితకా అవకాశాలు కూడా ఇలాంటి న్యూస్ లతో చేజారిపోయే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*