Tue Apr 30 2024 20:25:34 GMT+0000 (Coordinated Universal Time)
మూడోసారి బండ్ల గణేష్ కు కరోనా
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరెోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరెోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బండ్ల గణేష్ కు మూడోసారి కరోనా సోకింది. రెండో సారి కరోనా సోకినప్పుడు ఆయన తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడం కూడా అప్పట్లో కష్టమయిందని బండ్ల గణేష్ చెప్పారు.
ఢిల్లీలో ఉండి....
గత మూడురోజులుగా బండ్ల గణేష్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న గణేష్ కొంత అస్వస్థతగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్ పాజిటివ్ గా తేలిందని ఆయన ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యులకు మాత్రం నెగిటివ్ వచ్చిందని, అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని బండ్ల గణేష్ కోరారు.
Next Story