'గీత గోవిందం' ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్..!
నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమా సూపర్ హిట్ టాక్ తో అదరగొట్టేస్తుంది. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి షోకే పాజిటివ్ అండ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' క్రేజ్ ఈ సినిమాకి ఏ రేంజ్ లో పనిచేసిందంటే... గీత గోవిందానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది. 'గీత గోవిందం' ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
ఏరియా షేర్స్ (కోట్లలో )
నైజాం 1.78
సీడెడ్ 1.12
నెల్లూరు 0.25
కృష్ణ 0.45
గుంటూరు 0.63
వైజాగ్ 0.72
ఈస్ట్ గోదావరి 0.48
వెస్ట్ గోదావరి 0.46
ఏపీ అండ్ టీఎస్ షేర్ 5.89 కోట్లు
కర్ణాటక 0.60
ఓవర్సీస్ 2.40
ఇతర ప్రాంతాలు 1.00
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే షేర్ 9.89 కోట్లు