గీత గోవిందం జోరు మామూలుగా లేదుగా..!
ఒక స్టార్ హీరోకి రావాల్సిన కలెక్షన్స్ నిన్న కాక మొన్న వచ్చిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాకి వచ్చాయి. పాతిక సినిమాల అనుభవం ఉన్న స్టార్ హీరోలు సైతం అందుకోలేని ఫీట్ ను మన విజయ్ బాబు నాలుగు సినిమాలకే అందుకున్నాడు. రీసెంట్ గా 'గీత గోవిందం'తో సినిమా 60 కోట్లు క్లబ్ లో చేరిపోయాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19 రోజుల్లో ఏకంగా 60.37 కోట్లు కలెక్ట్ చేసింది. 19 రోజుల వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ వివరాలు మీకోసం..
ఏరియా షేర్స్ (కోట్లు)
నిజాం 17.60
సీడెడ్ 6.13
నెల్లూరు 1.33
కృష్ణ 3.22
గుంటూరు 3.32
వైజాగ్ 5.03
ఈస్ట్ గోదావరి 3.32
వెస్ట్ గోదావరి 2.67
టోటల్ (ఏపీ & టీఎస్) 42.62
యూఎస్ ఏ 10.50
రెస్ట్ అఫ్ ఇండియా 7.25
టోటల్ (వరల్డ్ వైడ్ ) 60.37