Fri Apr 19 2024 10:36:25 GMT+0000 (Coordinated Universal Time)
గూఢచారి మొదటి వారం వసూళ్లు..!
అడివి శేష్ కథతో తెరకెక్కిన గూఢచారి సినిమా అడివి శేష్ హీరోగా కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లు కొల్లగొడుతుంది. స్పై థ్రిల్లింగ్ కథగా అడివి శేష్ స్టైలిష్ నటన, జగపతి బాబు విలనిజం, ప్రకాష్ రాజ్ సెంటిమెంట్.. టోటల్ గా దేశం మీదున్న ప్రేమ వెరసి గూఢచారి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. గత వారం హిట్ అయిన చి.ల.సౌని దాటుకుంటూ కనక వర్షం కురిపిస్తుంది. అలాగే ఈ వారం కూడా గూఢచారి దూకుడు మాములుగా లేదు. ఈ వారం సినిమాలేవీ పెద్దగా హిట్ అవలేదు కాబట్టి. ఇకపోతే గూఢచారి సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్స్.
ఏరియా షేర్స్ (కోట్లలో)
నైజామ్ 2.20 .
సీడెడ్ 0.40
ఉత్తరాంధ్ర 0.56
గుంటూరు 0.31
ఈస్ట్ గోదావరి 0.35
వెస్ట్ గోదావరి 0.20
కృష్ణా 0.46
నెల్లూరు 0.12
ఏపీ అండ్ టీఎస్ షేర్ 4.60 కోట్లు
ఇతర ప్రాంతాలు 0.51
ఓవర్సీస్ 1.80
వరల్డ్ వైడ్ షేర్ 6.90 కోట్లు
Next Story