సినిమా పోయిందనా.. సైలెంట్ అయ్యారు…?

niharika on syeraa movie role

ఈమధ్యన ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలు టాక్ ఎలా వున్నా అంటే.. పాజిటివ్ గా ఉన్నా.. ఫ్లాప్ టాక్ అయినా సాయంత్రానికల్లా… సక్సెస్ మీట్ పెట్టేసి తమ సినిమా హిట్ అని చెప్పేస్తూ సినిమా మీద ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెంచుతూ పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు. అలాగే ఈమధ్యనే విడుదలైన లవర్ సినిమా కానివ్వండి.. ఈ లిస్ట్ లో బోలెడన్ని సినిమాలు వస్తాయి. అలాంటిది సినిమా విడుదలకు భారీ ప్రమోషన్స్ తో హడావిడి చేసిన హ్యాపీ వెడ్డింగ్ టీమ్ విడుదలై నెగెటివ్ టాక్ రాగానే సైలెంట్ అయ్యింది. మరో పక్క మెగా డాటర్ అయిన నిహారిక కోసం సినిమా విడుదలకు ముందు నిహారిక అన్న మెగా హీరో రామ్ చరణ్ వచ్చాడు కానీ.. విడుదలయ్యాక సినిమా మీద ఒక్కళ్ళు కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వకపోవడమే కాదు.. అసలు స్పందించనేలేదు.

హ్యాపీ వెడ్డింగ్ ని పూర్తిగా వదిలేశారే..?

మరి చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమా విడుదలై సేమ్ హ్యాపీ వెడ్డింగ్ కి ఏ టాక్ అయితే వచ్చిందో అదే టాక్ వచ్చింది. కానీ కళ్యణ్ దేవ్ కి ఆయన బావ రామ్ చరణ్ పర్టిక్యులర్ గా విషెస్ చెప్పాడు. మరి నిహారికకు ఎందుకలా వదిలేసి సైలెంట్ గా వుంది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు ఈ విషయమై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి. పాపం నిహారిక కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో నెగెటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ పరంగా వీక్ గా వుంది. హీరో సుమంత్ అశ్విన్ సైడ్ నుండి సినిమాకి గట్టి సపోర్ట్ లేదు.

ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు…

అందుకే సినిమా విడుదలై నాలుగురోజులైంది సినిమాకి సంబంధించి ఒక్క మాట గాని.. ఒక్క ఈవెంట్ గాని తలపెట్టలేదు నిర్మాతలు. ఎలాగూ పోయిన సినిమాకి ఏం చేసినా వేస్టు అనుకుంటున్నట్లుగా వుంది వారి తీరు. ఏది ఏమైనా మెగా డాటర్ కి ఇంతకన్నా అవమానం మరొక్కటి ఉండదేమో.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*