మెగా హీరోలను వదలనంటున్నాడు

varun tej to play as a villain in dil raju movie

డీజే తర్వాత బాగా గ్యాప్ ఇచ్చిన హరీష్ శంకర్ తో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలెవరు మొగ్గు చూపడం లేదో.. అసలు హీరోలు హరీష్ కి అవకాశం ఇవ్వడం లేదో తెలియదు కానీ.. హరీష్ శంకర్ మాత్రం రెండు మూడు కథలతో సినిమాలు చెయ్యడానికి రెడీగానే ఉన్నాడు. అసలు డీజే తర్వాత హరీష్ శంకర్ దాగుడు మూతలు సినిమా చెయ్యాలనే ఉద్దేశయంతో ఉంటే… ఆ సినిమాలో నటించేందుకు హీరోలెవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక డీజే తర్వాత మన బ్యానర్ లోనే సినిమా ఉంటుందని చెప్పిన దిల్ రాజు కూడా హరీష్ ని హోల్డ్ లో పెట్టేసాడు.

అయితే చాలారోజులనుండి ఖాళీగానే ఉంటున్న హరీష్ శంకర్ మాత్రం మెగా హీరోల చుట్టూనే తిరుగుతున్నాడు. మెగా కాంపౌండ్ నే అంటిపెట్టుకుని ఉంటున్న హరీష్ శంకర్ ఇప్పుడు మరో మెగా హీరోను పట్టాడని ఫిలిం నగర్ టాక్. తమిళంలో హిట్ అయిన జిగర్తాండ ని హరీష్ తెలుగులో రీమేక్ చెయ్యడానికి రెడీ అవడమే కాదు… ఈ సినిమాలో తమిళంలో నటించిన సిద్దార్ద్ ప్లేస్ లో అయినా.. లేదంటే విలన్ గా నటించిన బాబీసింహా ప్లేస్ లో అయినా మెగా హీరో వరుణ్ తేజ్ ని నటింపచేయాలని.. వరుణ్ తేజ్ ని హరీష్ పట్టుకున్నాడనే టాక్ ఎప్పటినుండో వినబడుతుంది.

అయితే వరుణ్ కి జోడిగా హరీష్ శంకర్ ఈ సినిమా రీమేక్ కోసం గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందాన్నని ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. మరి వరుణ్ పక్కన నటించడానికి రష్మిక మందన్న ఒప్పుకుంటుందో లేదో గాని.. రష్మిక, వరుణ్ తేజ్ ల జోడి మాత్రం ఫిదా లో వరుణ్ – సాయి పల్లవుల జోడిలా ఉంటుందంటున్నారు మెగా అభిమానులు. మరి హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ – రశ్మికల కలయిక సాధ్యమవుతుందా?లేదా? అనేది మాత్రం అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మలేం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*