బిగ్ బాస్ లోకి ప్రముఖ హీరోయిన్ ఎంట్రీపై క్లారిటీ

బిగ్ బాస్ మొదటి సీజన్ ఆకట్టుకున్నట్టు రెండో సీజన్ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోతుందని మొదటి నుండి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. మొదటిలో నాని యాంకరింగ్ తో అంతగా తన సత్తా చూపించట్లేదని వార్తలు వచ్చిన.. ఆ తర్వాత మెల్లమెల్లగా పుంజుకున్నాడు. ఇక పార్టిసిపెంట్స్‌ విషయంలో సత్తా లేదని మొదటి నుండి వస్తున్న మాట.

పార్టిసిపెంట్స్‌ సెలక్షన్ యే ఈసారి అసలు బాగోలేదని బలంగా వినిపించిన మాట వాస్తవం. అయితే దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టారు. అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ అని నందిని పంపించారు. కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు మరో కొత్త వాళ్లని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకి పంపించనున్నారు అని వార్తలు వచ్చాయి.

అయితే మళ్లీ ఈసారి హీరోయిన్ కావడం విశేషం. టాలీవుడ్ లో ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన హెబ్బా పటేల్ ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తున్నారని వార్తలొచ్చాయి. మొన్న ఆదివారం సైతం ఆ రూమరే జోరుగా నడిచింది. ఆమె కచ్చితంగా బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు అంత. అయితే హెబ్బాపటేల్ షోలో పాల్గొనబోవడం లేదంటూ క్లారిటీనిచ్చేసింది. నా చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. నాకు అసలు కాళీ కూడా లేదు అని క్లారిటీ ఇచ్చింది. అయితే హెబ్బా పటేల్ బిగ్ బాస్ లో పాల్గొనదని…. బిగ్ బాస్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తే గనక ఆమెకు హీరోయిన్ గా సినిమాలు లేకే ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందని అనుకుంటారని.. అందుకే హెబ్బా ఎట్టి పరిస్థితుల్లోనూ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళదని తెలుగు పోస్ట్ ముందే చెప్పింది. ప్రస్తుతం ఆమె నటించిన ’24 కిస్సెస్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*