ఆ హీరోయిన్స్ ని ఫాలో అవ్వండి.. టైం పాస్ అవ్వుద్ది!!

కరోనా టైం ని హీరో హీరోయిన్స్ ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండి ఫ్యామిలీకి టైం కేటాయించలేని హీరో హీరోయిన్స్ ఇప్పుడు కరొనతో ఖాళీగా ఇంట్లో వారితో సమయం గడుపుతున్నారు. కొంతమంది హీరో హీరోయిన్స్ జిమ్ వర్కౌట్స్ అంటుంటే కొంతమంది రకరకాల వంటలతో సమయాన్ని గడుపుతున్నారు. విజయ్ దేవరకొండ – పూరి హీరోయిన్ అనన్య పాండే అయితే తనకిష్టమైన పెయింటింగ్స్ వేసుకుంటూ టైం పాస్ చేస్తుంది.

ఇక శృతి హాసన్ అయితే లండన్ నుండి తిరిగొచ్చి… క్వారంటైన్ గడుపుతూ.. స్వయంగా ఆర్గానిక్ సబ్బులు తయారీ మొదలెట్టింది. ఖాళీగా ఉన్నప్పుడు నాకెప్పుడూ బోర్ కొట్టాడు. ఒక్కదాన్నే ఉన్నా నాకు టైం పాస్ అవుతుంది. ఆర్గానిక్ సోప్స్ చేస్తూనో లేదంటే వంట చేస్తూనో, లేదంటే బేకింగ్ ఐటెమ్స్ ట్రై చేస్తుంటా అంటూ తన ఖాళీ సమయాన్ని క్వారంటైన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చెబుతుంది.  మరి నాని లాంటి హీరోస్ వంటలు రెడీ చేస్తున్నారు. ఇంకా హీరోలంతా ఫ్యామిలీతో పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీ అంటున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*