రియల్ ఫైట్ కాస్త.. బాక్సాఫీసు ఫైట్ అవుతుందా?

బాలీవుడ్ లో మొన్నామధ్యన హృతిక్ రోషన్ కి కంగనాకు మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేంత కక్షలు నడిచాయి. వారిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్న లవ్ బర్డ్స్. అందుకే హృతిక్ రోషన్ తన భార్య కి విడాకులిచ్చాడని బి టౌన్ వర్గాలు కోడై కూశాయి. అయితే వారి మధ్యన ప్రేమ, బ్రేకప్ కూడా జరిగిపోయాయి. బ్రేకప్ అయ్యాక చానళ్ళు సైలెంట్ గా ఉన్న ఈ జంట మధ్య తర్వాత మాటల యుద్ధమే నడిచింది. కంగనా రనౌత్ తనని హృతిక్ రోషన్ చాలా డీప్ గా లవ్ చేసాడంటే… దానికి హృతిక్ రోషన్… కంగనాకు అంత సీన్ లేదంటాడు. కానీ కంగనా హృతిక్ రోషన్ ని ఏ విధంగానూ వదలకుండా హ్రితిక్ ని తన మాటల్తో చీల్చి చెండాడింది. అసలు హ్రితిక్ రోషన్ వల్ల తాను చాలా నష్టపోయానని బహిరంగంగానే కంగనా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం తగ్గించిన ఈ జంట బాక్సాఫీసు వద్ద ఒకేసారి తమ సినిమాల్తో దిగబోతున్నారనే న్యూస్ ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి అదే జరిగితే… రియల్ లైఫ్ ఫైట్ కాస్త రీల్ లైఫ్ ఫైట్ గా మరే అవకాశం ఉంది. ప్రస్తుతం హ్రితిక్ రోషన్ సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కథతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా కోసం హ్రితిక్ తన తన శరీరాన్ని తన లుక్స్ ని పూర్తిగా మార్చుకున్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడే వచ్చే ఏడాది అంటే 2019 రిపబ్లిక్ డే జనవరి 26 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి కంగనా కూడా తన సినిమాతో దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.

క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చారిత్రాత్మక చిత్రం మణికర్ణిక అసలైతే ఈ ఆగష్టు 15 కి స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా బాక్సాఫీసు బరిలో దిగాల్సింది. కానీ క్రిష్ టాలీవుడ్ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో పాటుగా… మాణికర్ణికలోని కొన్ని సీన్స్ ని మల్లి రి షూట్ కారణంగా ఇప్పడు ఆగష్టు 15 న విడుదలవ్వాల్సిన సినిమా కాస్తా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి పోస్ట్ పోన్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎలాగూ రీ షాట్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని ఈ ఏడాది చివరి కల్లా పూర్తవుతాయి కాబట్టి సినిమాని ఫ్రెష్ గా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి విడుదల చేద్దామని కంగనా .. క్రిష్ కి చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి మీడియా ముందు తిట్టుకునే ఈ జంట ఇప్పుడు బాక్సాఫీసు వద్ద ఢీ కొడితే మాత్రం అటు హృతిక్ రోషన్ కి ఇటు కంగనాకు కూడా క్రేజ్ ఆటోమాటిక్ గా వస్తుంది. ఎలాగూ ఇద్దరి మధ్యన విభేదాలున్నాయి. అలాంటి టైం ఇలా బాక్సాఫీసు ఫైట్ కి దిగితే వారి కథ మరింత రంజుగా ఉంటుంది కదా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*