ఇలియానా కి మంచి రోజులొస్తున్నాయా?

ఒకప్పుడు సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఇలియానా.. దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన నటించింది. కానీ బాలీవుడ్ బాలీవుడ్ అంటూ ఏళ్లతరబడి వెయిట్ చేసి మళ్ళీ సౌత్ కి వచ్చేసింది. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూనే సౌత్ లో అంటే టాలీవుడ్ లో మళ్ళీ సినిమాలు చేస్తూ బిజీ కానుంది. ఇప్పటికే రవితేజ – శ్రీను వైట్ల కాంబోలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న ఇలియానా ఈ సినిమాతోనే సౌత్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా అయ్యే లోపు మళ్ళీ ఇలియానాకు మరిన్ని టాలీవుడ్ అవకాశాలొస్తాయనే ప్రచారం జరుగుతుంది.

అయితే ఈలోపే మరో స్టార్ హీరో సరసన ఇలియానా కి ఒక ఆఫర్ వచ్చేట్లుగా ఉందంటూ ఫిలింనగర్ టాక్. పోకిరి సినిమాతో జోడి కట్టి ఇండస్ట్రీ హిట్ అందించిన మహేష్ తో మరోమారు ఇలియానా జోడి కట్టబోతుందనే న్యూస్ వినబడుతుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమాలో మహేష్ సరసన యోగ టీచర్ గెటప్ లో ఇలియానా నడుంఒంపులతో దర్శక నిర్మాతలను పడేసింది. పోకిరి హిట్ తో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకున్న ఇలియానా కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసింది.

ఇక అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఇలియానా సుకుమార్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కబోతున్న మహేష్ 26 సినిమా కోసం ఇలియానా పేరు హీరోయిన్స్ లిస్ట్ లో పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మల్లీ మహేష్ – ఇలియానా జోడి మ్యాజిక్ చెయ్యబోతుందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మహేష్ 26 వ మూవీ ఇలియానా పేరు ఫైనల్ లిస్ట్ లో ఉంటుందో లేదో.. అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*