రాజమౌళి మల్టీ స్టారర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!

రాజమౌళి

తొలిసారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అనే పాటికి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ లోనూ ఆసక్తి ఏర్పడింది. రీసెంట్ గా రిలీజ్ అయిన అరవింద సమేత ట్రైలర్ కు ఇండస్ట్రీ నుండి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా ఈ చిత్రం ఈనెల 11న మన ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్ 300 కోట్లు పైనే అని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి రెండు భారీ సెట్స్ వేసే పనిలో ఉన్నారు జక్కన్న అండ్ టీం. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో, ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకమైన భారీ సెట్స్ వేస్తున్నారు.

మరి కథపై క్లారిటీ వచ్చిందా..?

ఇంతవరకు టైటిల్ ను ప్రకటించిన ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరో..? ఇతర తారాగణం ఏంటో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు రాజమౌళి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా నవంబర్ చివరి వారంలో గానీ.. డిసెంబర్ మొదటి వారంలో గానీ పూజా కార్యక్రమాలు నిర్వహించి జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫస్టు షెడ్యూల్లో ఎన్టీఆర్.. ఆ తరువాత షెడ్యూల్లో చరణ్ పాల్గొంటారట. అంతాబాగానే ఉంది కాని సినిమా స్టోరీ ఏంటి అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. స్టోరీ పై రకరకాలు వార్తలు వస్తున్నప్పటికీ ఇది తెలుగులో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్ ను రాజమౌళి టేకప్ చేసి పట్టాలెక్కించనున్నాడనేది ఫిలింనగర్ సమాచారం.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*