టాలీవుడ్ ఎంట్రీ.. విలువ మూడున్నర కోట్లు
శ్రీదేవి గనక బ్రతికి ఉంటే.. జాన్వీ కపూర్ ఎప్పుడో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేది… అంటూ సోషల్ మీడియాలో ఎప్పటినుండో వార్తలు రావడం, రాజమౌళి, జాన్వీ కపూర్ ని [more]
శ్రీదేవి గనక బ్రతికి ఉంటే.. జాన్వీ కపూర్ ఎప్పుడో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేది… అంటూ సోషల్ మీడియాలో ఎప్పటినుండో వార్తలు రావడం, రాజమౌళి, జాన్వీ కపూర్ ని [more]
శ్రీదేవి గనక బ్రతికి ఉంటే.. జాన్వీ కపూర్ ఎప్పుడో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేది… అంటూ సోషల్ మీడియాలో ఎప్పటినుండో వార్తలు రావడం, రాజమౌళి, జాన్వీ కపూర్ ని రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా #RRR మూవీ కోసం తీసుకొస్తున్నాడనే ప్రచారం జరిగినా.. తాజాగా జాన్వీ కపూర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఫైటర్ తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే న్యూస్ నడుస్తుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాకి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హెల్ప్ చెయ్యడమే కాదు.. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని విజయ్ దేవరకొండ సరసన నటింపజేసేందుకు కీలక పాత్ర పోషించాడని న్యూస్ నడుస్తుంది. మొత్తానికి జాన్వీ కపూర్ భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఫైటర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది.
అయితే జాన్వీ కపూర్ తెలుగు సినిమాలోనే కాదు.. పలు భాషల్లో తెరకెక్కనున్న ఈ ఫైటర్ కోసం భారీ పారితోషకం అందుకోబోతుందట. అది కూడా 3.5 కోట్లు అంటూ ఓ ఫిగర్ బయటికొచ్చింది. పూరి జగన్నాధ్ – ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫైటర్ సినిమా కోసం జాన్వీ కపూర్ కి మూడున్న కోట్లు ముట్ట జెబుతున్నారట. మరి పాన్ ఇండియా ఫిలిం కాబట్టి జాన్వికి అంత సమర్పిస్తున్నారు కానీ.. ఒక్క టాలీవుడ్ లోనే అయితే జాన్వికి అంత ఇచ్చుకునేవారు కాదు. మరి ఆ సినిమా కేవలం టాలీవుడ్ లోనే తీస్తే జాన్వీ కపూర్ కూడా ఒప్పుకునేది కాదేమో. ఏదైనా ఫైటర్ తో జాన్వీ కపూర్ టాలీవుడ్ కి భారీ పారితోషకం తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నదనేది మాత్రం నిజమంటున్నారు