కబీర్‌ సింగ్‌ చాలా స్ట్రాంగ్ గా ఉంది!

కబీర్ సింగ్

తెలుగు లో ట్రెండ్ సెట్టర్ అయినా అర్జున్ రెడ్డి కి రీమేక్ గా హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ రూపొందింది. అయితే ఈమూవీ ని చూసిన కొంతమంది సభ్య సమాజం సిగ్గుతో చచ్చిపోవాలంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. మరి కొందరు స్త్రీలని ఎలా చూపిస్తారా? అని ప్రశించారు. అయితే డైరెక్టర్ సందీప్ వంగా కానీ హీరో షాహిద్ కపూర్ కానీ ఈ కామెంట్స్ పై ఎటువంటి కామెంట్స్ చేయడంలేదు.

ఈమూవీ ని డైరెక్టర్ సందీప్ ఎంత అమితంగా తీసాడు. హిందీ లో సీన్‌ కూడా మార్చకుండా ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ మళ్లీ తీసాడు. బాలీవుడ్ లో చిత్రం కాబట్టి ఈసారి కొంచం క్వాలిటీతో తీసాడు. తెలుగులో ఈసినిమా గురించి ఎవరు ఏమి మాట్లాడలేదు కానీ హిందీ వాళ్లయితే ఈసినిమా కి నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా ఇంటెన్స్ ఉన్న సినిమా ఇది. ఇటువంటి లవ్ స్టోరీస్ చాలా రేర్ గా వస్తాయి.

హీరోయిన్ ని కూడా ఎలా చూపించాలో ఆలా చూపించాడు సందీప్. చాలా సాఫ్ట్ గా ఉండే అమ్మాయి లా చూపించాడు. కథని కథలా చూడకుండా సినిమాని ఏకి పారేయడం భావ్యం కాదు. అయితే ఈసినిమా కి ఏమి ఎఫెక్ట్ పడడంలేదు.బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత సృష్టిస్తోంది.  తొలి వీకెండ్ లోనే దాదాపు డెబ్బయ్‌ కోట్ల నెట్‌ వసూళ్లతో స్ట్రాంగ్ గా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*