పారితోషకం కోసం ఏమైనా చేస్తారా

కాజల్ అగర్వాల్

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించే హీరోయిన్స్ అంతా… టాప్ హీరోయిన్స్ అయ్యే ఉండాలి. ఒకే ఒక్క సినిమాలో కాస్త పేరు లేని హీరోయిన్ తో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మిగతా సినిమాలన్నిటిలో పేరున్న హీరోయిన్స్ తోనే రొమాన్స్ చేసాడు.అయితే బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి చిన్న హీరోతో క్రేజున్న హీరోయిన్స్ నటించాలి అంటే.. కేవలం పారితోషకాన్ని డబుల్ ఇస్తేనే హీరోయిన్స్ అతనితో నటించడానికి ఒప్పుకుంటారనేది బహిరంగ సత్యం. మరి బెల్లంకొండ సురేష్ కొడుకుని హీరోగా నిలబెట్టడానికి సినిమాలకి భారీ బడ్జెట్స్ పెట్టడమే కాదు… టాప్ హీరోయిన్స్ ని కూడా తెచ్చి పెడుతున్నాడు. మరీ ఓ అన్నంత హిట్స్ కొట్టకపోయిన.. బెల్లంకొండ సినిమాలు యావరేజ్ హిట్స్ అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఒకేసారి రెండు సినిమాల్లో చందమామ కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్నాడు.

తేజ డైరెక్షన్ లోని సినిమాతో పాటుగా.. కొత్త డైరెక్టర్ తో కవచం సినిమాలోను బెల్లంకొండ కాజల్ తో జోడి కట్టాడు. తాజాగా కవచం సినిమా వచ్చే వారం విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఆ సినిమాలో కాజల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న రొమాన్స్ లో హాట్ నెస్ కనబడుతుంది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా హాట్ అండ్ సెక్సీ లుక్ లో చింపేస్తుంది. మరి గతంలోనూ సమంత అల్లుడు శీను సినిమాలో హాట్ హాట్ గా శ్రీనివాస్ సరసన నటించింది. అయితే పారితోషకం విషయంలో గట్టిగా ఇవ్వబట్టే హీరోయిన్స్ అంతా బెల్లంకొండ పక్కన గ్లామరస్ గా కనబడుతున్నారంటున్నారు సగటు ప్రేక్షకులు.

Kajal Agarwal in Kavacham movie

పారితోషకం దండిగా ఇస్తే హీరోయిన్స్ చాలామంది గ్లామర్ పరంగా కూడా హద్దు లేకుండా ఆరబోస్తున్నారనే టాక్ వినబడుతుంది. మరి సమంత అయినా కాజల్ అయినా రకుల్ అయినా పూజ హెగ్డే అయినా శ్రీనివాస్ లాంటి హీరోలపక్కన డబ్బు కోసమే నటిస్తున్నారంటూ కామెంట్స్ అయితే వినబడుతుంది. మరి తాజాగా విడుదలైన కవచం పోస్టర్స్ లో కాజల్ ఎంతగా గ్లామర్ ఒలకబోసిందో.. బెల్లంకొండ తో ఆ ఘాటు రొమాన్స్ ఎలా ఉందొ మీరే చూడండి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*