కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఏంటో తెలుసా..?

kalyanram next movie zoner

నందమూరి కళ్యాణ్ రామ్ కి సరైన హిట్ పడి చాలా నెలలు కావొస్తుంది. అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి తన మొదటి సినిమా పటాస్ తో హిట్ ఇచ్చాడు. ఆ తరువాత చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. లేటెస్ట్ గా ‘118’ తో కొంచం పర్లేదు అనిపించాడు. ఈ ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీని వేణు మల్లిడి డైరెక్షన్ చేయనున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ‘తుగ్లక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇద్దరు హీరోయిన్లతో…

ఈ మూవీ కూడా కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే నిర్మితం కానుంది. ఇందులో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేయనుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకాచకా జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉందట. ప్రస్తుతం టీం ఆ హీరోయిన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే వారి పేర్లు తెలియనున్నాయి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*