ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయా?

టాలీవుడ్ లో ఏప్రిల్ చివరి వారం అంటే సినిమాలకి మంచి సీజన్. ఎందుకంటే అప్పుడే అందరికి ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకుని హాలీడేస్ లో ఉంటారు కాబట్టి. ఏప్రిల్ చివరి వారం అంటే పెద్ద సినిమాలు చాలానే రిలీజ్ అవుతుంటాయి. గత ఏడాది ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అయింది. అంతకుముందు ఏడాది పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి.

కానీ ఈ వారం విడుదల అయిన రెండు తెలుగు సినిమాలు ఫట్ అనిపించాయి. ఒకటి సాయి పల్లవి హీరోయిన్ – నాగ శౌర్య హీరోగా ‘కణం’ అనే సినిమా. రెండోవది మంచు విష్ణు – బ్రహ్మి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ రెండు సినిమాలు వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలీదు. వీటికి కనీస స్థాయిలో ప్రొమోషన్స్ చేయకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

వాస్తవానికి ఏప్రిల్ 27న రజినీకాంత్ ‘కాలా’ రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఆ సినిమా రిలీజ్ సడన్ గా వాయిదా వేసుకోవటంతో ఈ రెండు సినిమాలు ఉన్నట్లుండి రిలీజ్ చేసేశారు. ప్రమోషన్లు కూడా లేకపోవడంతో ప్రీ రిలీజ్ బజ్ ఏమీ లేకపోయింది. దీనికి తోడు రెండు సినిమాల్లో కంటెంట్ లేకపోవడంతో జనాలకి ఈ సినిమాలు వచ్చిన సంగతి కూడా తెలియలేదు. అదే రోజు ఈ రెండు సినిమాలతో పాటు రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ ‘ఎవంజర్స్’ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి మామూలుగా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*