కీర్తి కూడా ఒప్పేసుకుందా?

Keerti Suresh upcoming movies

ఈమధ్యన ఏ సినిమా చూసినా సరే ఆ సినిమాలో హీరోయిజం తప్ప హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యతే ఉండడం లేదు. అయినా సౌత్ హీరోలంతా అంతే… హీరోయిజం చూపించే కథలనే ఎన్నుకుంటారు. అందుకే హీరోయిన్స్ కి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా… టాప్ స్టార్స్ పక్కన చిన్న పాత్ర చేసిన చాలు.. స్టార్ డం వచ్చేస్తుంది అని ఒప్పేసుకుంటారు. ఏదో రంగస్థలం లాంటి కథల్లో హీరోయిన్స్ ని కథకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించినా.. చాలా పెద్ద స్టార్స్ సినిమాల్లో హీరోయిన్స్ ది కూరలో కర్వేపాకు పాత్రే. అయినా హీరోయిన్స్ ఎందుకొప్పుకుంటున్నారంటే….. కెరీర్ లో కొన్నాళ్ళు నిలబడాలి గనక.

Keerti Suresh mahanati Telugu Cinema News

ఇక స్టార్స్ ని కాదని లేడి ఒరింటెడ్ చిత్రాలను చెయ్యడాయికి దర్శకనిర్మాతలు చొరవ చూపరు. ఒకవేళ మంచి కథతో సినిమా చేస్తే సూపర్ హిట్స్ కొట్టొచ్చని… అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, మహానటి వంటి చిత్రాలు నిరూపించాయి. ఇక హీరోయిన్స్ లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు ఒకే చెప్పారంటే వారి కెరీర్ చరమాంకంలో పడినట్లే అని భావిస్తారు.. సదరు ప్రేక్షకులు. తాజాగా మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసిన తమిళ బిగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఢమాల్ అనడం, ఆ సినిమాల్లో కీర్తి కి ప్రాధాన్యత లేకపోవడంతో… కీర్తి సురేష్ ని పెద్ద ప్రాజెక్టులలోకి పిలవాలంటే భయపడుతున్నారు.

Keerti Suresh Mahanati Telugu Cinema News Telugu News

సర్కార్ సినిమా తర్వాత అవకాశాలు లేని కీర్తి సురేష్ తాజాగా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సై అందట. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై నిర్మాత మహేష్ కోనేరు నిర్మాణంలో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఆ మూవీ లేడీ ఓరియెంటెడ్ కథతో ఉండబోతున్నట్టు సమాచారం. మరి మహానటి తో తెలుగు, తమిళ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాతోనూ మంచి క్రేజ్ సంపాదిస్తుందని.. కథలో తన పాత్ర కి ఉన్న ఇంపార్టెన్స్ వలెనే కీర్తి ఈ సినిమాకి సై అందనే టాక్ నడుస్తుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*