కీర్తికి బరువైన పాత్రే తిప్పలు తెచ్చిందా..

Keerti Suresh upcoming movies

కీర్తి సురేష్ ట్రెడిషనల్ గా… అందమైన మోహ వర్ఛస్సుతో… తన టాలెంట్ ని నమ్ముకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. నటన పరంగా కీర్తి సురేష్ కి ఎక్కడా పేరు పెట్టడానికి లేదు. ఇక గ్లామర్ అంటారా… హీరోయిన్స్ ఆటోమాటిక్ గా ఆ గ్లామర్ ట్రాప్ లో పడిపోతారు. అయితే కీర్తి సురేష్ కి మాత్రం అందాలను చూపించే ఆవరసం లేకుండానే మంచి మంచి పాత్రలు వచ్చాయి. అమ్మడు అందమైన నటనతో ఆకట్టుకుంది. ఇక ఆమె ఈ ఏడాదినటించిన మహానటి మూవీ తో అందమైన కనుబొమ్మల్తో… మేలిమి ఛాయతో మెరిసిపోవడమే కాదు.. హావభావాలతో.. సావిత్రిని మరిపించింది. మహానటిలో సావిత్రిలా కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక మహానటి తో టాలీవుడ్ కోలీవుడ్స్ లో బాగా బిజీ అవుతుంది అనుకున్న ప్రేక్షకులకు కేవలం కోలీవడ్ లో రెండు మూడు సినిమాల్తో మాత్రం బిజీగా వున్న కీర్తి సురేష్ కి తెలుగులో సినిమాలే లేవు.

అయితే కీర్తి సురేష్ తెలుగు సినిమాలను అవాయిడ్ చేస్తుందనే టాక్ నడిచింది. అయితే కీర్తి సురేష్ కి తెలుగులో అవకాశాలు రావడం లేదనేది లేటెస్ట్ న్యూస్. మహానటి తో కీర్తి సురేష్ ఇంటి ముంది దర్శకనిర్మాతలు బారులు తీరగా.. కీర్తి తెలుగుని పట్టించుకోవడం లేదంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే కీర్తి కి తెలుగులో అవకాశాలు రావడం లేదట. కారణం ఆమె బరువు అంటున్నారు. మహానటి టైం లోనే కీర్తి సురేష్ బరువు పెరడగం .. అజ్ఞాతవాసి సినిమా అప్పుడు కూడా కీర్తి దిట్టం గా ఉండడంతో.. ఆమెకి అవకాశాలు సన్నగిల్లయంటున్నారు. తాజాగా కీర్తి సురేష్ కోలీవుడ్లో విక్రమ్ తో కలిసి నటించిన సామి 2 లోను కాస్త బరువుగా ఉండడం ఆ సినిమా స్టిల్స్ లో తెలుస్తుంది. మరి అలా బరువున్న కీర్తి కి గ్లామర్ డ్రెస్ వేస్తె అంతగా బావుండదనే టాక్ నడుస్తుంది. అయితే తనకి అవకాశాలు సన్నగిల్లడంతో కీర్తి సురేష్ డిప్రెషన్ కి లోనైనట్లుగా వార్తలొస్తున్నాయి.

మరి అందం, అభినయం ఉంటే సరిపోదు.. దానికి కావాల్సిన గ్లామర్ కూడా ఉండాలి. కానీ కీర్తి ఆ విషయాన్నీ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. అజ్ఞాతవాసి టైం లోనే కీర్తి బరువుపై బోలెడన్ని కామెంట్స్ పడ్డాయి. మరి ఇప్పటికైనా కీర్తి సురేష్ తన బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఓకె. లేదంటే ఒకటి రెండేళ్లకు తట్టా బుట్టా సర్దుకోవాల్సి వస్తుంది. ఇకపోతే తెలుగులో ఎన్టీఆర్ బయో పిక్ సినిమాలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్ర పోషిస్తుందని టాక్ ఉంది.. కానీ కన్ఫర్మేషన్ లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*