ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘ ఖైదీ’

karthi dev will release on feb 14

కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ బేనర్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఖైదీ’ ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను కాసేపటి క్రితం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే పాటలు రొమాన్స్ లేకుండా ఓన్లీ యాక్షన్ అండ్ థ్రిల్స్ తో సిద్దమవుతున్న కార్తీ ఆడియన్స్ కి ఒక స్పెషల్ కిక్కు ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది. సినిమా స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది.

స్ట్రాంగ్ డైలాగ్స్……

జీవిత ఖైదిగా ఉన్న ఒక కూతురి తండ్రిగా కార్తీ సినిమాలో కనిపిస్తున్నాడు. అలాగే జైలు నుంచి తప్పించుకొని పోలీస్ ఆఫీసర్ తో అతని ప్రయాణం ఎలా సాగింది అనే పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. సినిమాలో యాక్షన్ డోస్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. విశేష ప్రశంసలు అందుకున్న ‘నగరం’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ ట్రైలర్ లో తన మార్క్ ఎలిమెంట్స్ తో ఆడియెన్స్ లో మంచి హైప్ ని క్రియేట్ చేశాడు. ఇక డైలాగ్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎక్కడికి పోతున్నావ్? ఏం చేస్తున్నావ్ చుట్టూ పాతిక మంది ఉన్నారు అని అనగానే ‘పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే నీకు తెలుసు లోపలికి వెళ్లే ముందు ఏం చేసేవాడినో తెలీదు కదా’ అంటూ కార్తీ పలికే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ‘ ఏం సత్తావని భయమేస్తుందా? చావునైనా ఎదిరించి చావాల్సిందే అంటూ కార్తీ చివరలో చెప్పిన ఆ లైన్ స్ట్రాంగ్ గా ఉంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*