ఖైదీ తో పక్కా హిట్ కొట్టాడుగా

ఖైదీ

మొదట్లో వైవిధ్యభరితైమన కథలతో హిట్స్ కొట్టిన కార్తీ… కాలక్రమేణా మాస్ మూస లో పడి ప్లాప్స్ బారిన పడ్డాడు. ఖాకి తో కమర్షియల్ హిట్ కొట్టిన కార్తీ చినబాబు, దేవ్ లాంటి సినిమాల్తో ప్లాప్స్ కొట్టాడు. ఇక తాజాగా ఖైదీ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీకి తమిళనాట ప్రేక్షకులు నీరాజనాలు పడుతుంటే.. తెలుగులోనూ ఖైదీ మంచి హిట్ కొట్టింది. అన్న సూర్య మార్కెట్ ని చూపిస్తూ కార్తీ ఖైదీ ని మరీ మూడున్నర కోట్లకు తెలుగు నిర్మాతలు కొనుగోలు చేశారు. మొదటి రోజు పర్వాలేదనిపించిన ఖైదీ వసూళ్లు శని, ఆదివారాల్లో పుంజుకున్నాయి. ఓవర్సీస్ లోను ఖైదీ జోరు సాగుతుంది. విజయ్ విజిల్ సినిమా కి నెగటివ్ టాక్ కూడా ఖైదీ వసూళ్లు పెరగడానికి కారణమైంది.

మౌత్ పబ్లిసిటీ…

తెలుగులో ఆదివారం నాటికీ 2.5 కోట్ల షేర్ సాధించిన ఖైదీ సోమవారం కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపించినా ఖైదీ తో నిర్మాతలకు లాభాలు ఖాయమంటున్నారు. ఖైదీ ఫస్ట్ వీక్ పూర్తి చేసుకునే సరికి తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయమని, అలాగే తమిళ తెలుగు భాషల్లో కలిపి ఫస్ట్ వీకెండ్ లో ఖైదీ సినిమా 14 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కార్తీ కి మంచి హిట్ కట్టబెట్టింది. కార్తీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేస్తోంది. అన్న సూర్య మూస కథల మాయలో డిజాస్టర్స్ కొడుతుంటే.. తమ్ముడు సూర్య మాత్రం వైవిద్యభరితమైన కథలతో హిట్స్ కొడుతున్నాడు. ఖైదీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. ఫ్యామిలీస్ తో కలిసి సినిమాకి వెళుతున్నారు అంటే… ఈ మౌత్ టాక్ తో వసూలు పెరగడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*