ఇలియానా కన్నా కియారా బెటర్ గా ఆలోచిస్తుంది

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కి ఈమధ్య బాగా కలిసొస్తుందని అర్ధం అవుతుంది. బాలీవుడ్ లో అంతంత మాత్రాన సినిమాలు చేస్తున్న టైంలో ఆమెకు టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె సీఎం గర్ల్ ఫ్రెండ్ గా బాగానే మెప్పించింది. ఆ సినిమా అవ్వగానే ఆమెకు నెట్ ఫ్లిక్స్ లో ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ మూవీ చేసే ఛాన్స్ వచ్చింది.

ఆ వెబ్ మూవీలో ఆమె ఎంతలా బోల్డ్ గా నటించిందో మనకి తెలిసిందే. బాగా హాట్ గా యాక్ట్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. దాంతో ఆమెకు టాలీవుడ్ లో తెగ ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ – బోయపాటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దింతో పాటు మరో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తుందంట.

అయితే ఆ రెండు మూవీస్ కు సంబంధించి పూర్తి వివరాలు ఆఫిషల్ గా అనౌన్స్ చేయాల్సివుంది. బాలీవుడ్ లో ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చిన టాలీవుడ్ లో సినిమాలు మాత్రం వదలటం లేదు. అటు బాలీవుడ్ లోను.. ఇటు టాలీవుడ్ లోను సమానంగా సినిమాలు చేసుకొస్తానంటోంది. ఒకప్పుడు ఇలానే ఇలియనా తెలుగులో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్ లో ఆఫర్స్ రాగానే అటు వెళ్ళిపోయింది. అక్కడ రెండు మూడు సినిమా చేయగానే ఆమెను పట్టించుకునే వారు లేకపోయారు. కానీ ఈ విషయంలో కియారా మాత్రం ఇలియానా కన్నా తెలివిగానే ఆలోచిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*