నిర్మాతంటే చరణ్ లా ఉండాలంట

రామ్ చరణ్ Ram charan telugu post telugu news

టాలీవుడ్ లో స్టార్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రామ్ చరణ్ చక్రం తిప్పుతున్నాడు. రంగస్థలం సినిమా తో ఎవరూ అందనంత ఎత్తుకు ఎదిగిన రామ్ చరణ్ తన తండ్రి కమ్ బ్యాక్ సినిమాలను వదలకుండా నిర్మాణం చేపడుతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతొ చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 నిర్మించి సక్సెస్ అయ్యాడు. తర్వాత చారిత్రకనేపథ్యం ఉన్న సైరా నరసింహారెడ్డి సినిమా ని భారీ బడ్జెట్ ట్ నిర్మిస్తున్నాడు. ఒక పక్క బోయపాటి సినిమా వినయ విధేయ రామ షూటింగ్ లో పాల్గొంటూనే సైరా నిర్మాతగా పనిచేస్తున్నాడు.

సైరా సినిమా సెట్స్ కి భారీగా ఖర్చుపెడుతున్న రామ్ చరణ్ ఆ సినిమా లో నటించే నటీనటులను ఎంతో గొప్పగా చూసుకుంటాడట. ఆ విషయాన్నీ సైరా లో నటిస్తున్న జగపతి బాబు చెబుతున్నాడు. టాలీవుడ్ విలన్ గా ఒక ఊపు ఊపుతున్న జగపతి బాబు సైరా నరసింహ రెడ్డిలో ఒక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సైరా లో పాత్ర వెయ్యడం కన్నా ముందే జగపతి బాబు కి రామ్ చరణ్ కి రంగస్థలం సినిమా అప్పుడే బాగా పరిచయం. రంగస్థలంలో జగపతి బాబు విలన్ గా నటించాడు. అయితే సైరా షూటింగ్ లో పాల్గొంటున్న జగపతి బాబు నిర్మాతగా చరణ్ ని తెగ పొగిడేస్తున్నాడు.

ఈమధ్యనే సైరా సినిమాకి సంబందించిన యాక్షన్ సన్నివేశాలను జార్జియాలో భారీ భారీ ఎత్తున సురేందర్ రెడ్డి టీమ్ చిత్రీకరించింది. అక్కడ సైరా యుద్ధ సన్నివేశాల్లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు దగ్గరనుండి అనేకమంది ఆర్టిస్ట్ లు పాల్గొన్నారు. అయితే అక్కడ చిన్న నటుడు పెద్ద నటులు అనే భేదం లేకుండా నిర్మాత రామ్ చరణ్ అందరి చాలా బాగా చూసుకున్నాడని…. అందరి ఆహారం దగ్గరనుండి ఆరోగ్యం వరకు చాలా శ్రద్ధ తీసుకున్నాడని చెప్పడమే కాదు.. ఎవరికి కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ అందరికి వసతి సౌకర్యాలను కల్పించాడట. ఇంకా అక్కడ షూటింగు జరిగే రోజుల్లో ఆర్టిస్టులకు ఎదురయ్యే ఇబ్బందులను రామ్ చరణ్ చక్కగా పరిష్కరించేవాడని….. నాకు తెలిసి చరణ్ మంచి నటుడే కాదు .. అంతకు మించి మంచి మనసున్న నిర్మాత కూడా అంటూ జగపతి బాబు చరణ్ ని తెగ పొగిడేస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*